IPL 2024 : కుల్దీప్.. బాల్‌ను ఇలా తిప్పితే ఆడేదెట్ల! పూరన్‌కు దిమ్మతిరిగిపోయింది.. వీడియో వైరల్
లక్నో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 8వ ఓవర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేశాడు. మూడో బంతికి మార్కస్ స్టోయినిష్ ను ఔట్ చేశాడు.

Kuldeep Yadav
Kuldeep Yadav : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో డీసీ జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీలో డీసీ జట్టు రెండో విజయాన్ని అందుకుంది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో డీసీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కుల్దీప్ అద్భుతమైన బంతితో లక్నో విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
Also Read : IPL 2024 : అంపైర్‌తో వాగ్వివాదానికి దిగిన రిషబ్ పంత్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు! వీడియో వైరల్
లక్నో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 8వ ఓవర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేశాడు. మూడో బంతికి మార్కస్ స్టోయినిష్ ను ఔట్ చేశాడు. ఆ తరువాత నికోలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు. పూరన్ ఖాతా తెరవకుండానే అద్భుతమైన బంతితో కుల్దీప్ పెవిలియన్ బాట పట్టించాడు. కుల్దీప్ వేసిన బంతిని పూరన్ సరిగా అంచనా వేయలేక పోయాడు. బంతి బయటకు టర్న్ అవుతుందని భావించిన పూరన్ ఆఫ్ సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ బంతికాస్త లెగ్ సైడ్ మళ్లి బ్యాట్, ప్యాడ్ మధ్యనుంచి వెళ్లి స్టంప్స్ ను పడగొట్టింది. బంతి ఎటువెళ్తుందో పూరన్ కు అర్ధంకాలేదు. వెంటనే తేరుకొని చూసుకునేసరికి బంతి వికెట్లను తాకింది. దీంతో అసలేం జరిగిందో అర్థంకాక పూరన్ కు ప్యూజ్ లు ఎగిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : IPL 2024 : 2014 ఐపీఎల్ సీజన్‌లో నమోదైన రికార్డును బద్దలుకొట్టిన బదోని, అర్షద్ జోడీ
????? ?? ????! ? ?
Kuldeep Yadav straight away unveiling his magic!??
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia ??#TATAIPL | #LSGvDC | @imkuldeep18 pic.twitter.com/pzfIQYpqnA
— IndianPremierLeague (@IPL) April 12, 2024