IPL 2024 : ఆర్సీబీపై విజయం తరువాత ముంబై ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూంలో ఏం చేశారో తెలుసా.. వీడియో వైరల్
ఆర్సీబీ జట్టుతో విజయం అనంతరం ముంబై జట్టు ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూంలో సందడి చేశారు. పలువురు ఆటగాళ్లు డ్యాన్స్ చేయగా..
Mumba iIndians : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు బౌలర్ జస్ర్పీత్ బూమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడటంతో ఆర్సీబీ నిర్ధేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ముంబై జట్టు ఛేదించింది. దీంతో ముంబై జట్టు ఐపీఎల్ 2024 టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన జట్టు తొలి మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది.. తరువాత రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది.
Also Read : IPL 2024 : అంపైర్‌తో వాగ్వివాదానికి దిగిన రిషబ్ పంత్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు! వీడియో వైరల్
ఆర్సీబీ జట్టుపై విజయం అనంతరం ముంబై జట్టు ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూంలో సందడి చేశారు. పలువురు ఆటగాళ్లు డ్యాన్స్ చేయగా.. రోహిత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుతూ కనిపించారు. తొలి మూడు మ్యాచ్ లు ఓడిపోయిన తరువాత ముంబై జట్టు ప్లేయర్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా వర్గాలుగా విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనికితోడు మైదానంలో ప్లేయర్స్ మధ్య సంఖ్యతలేకపోవటం కూడా ఆ వార్తలకు బలంచేకూర్చింది.
Also Read : IPL 2024 : 2014 ఐపీఎల్ సీజన్లో నమోదైన రికార్డును బద్దలుకొట్టిన బదోని, అర్షద్ జోడీ
తాజాగా, ఆర్సీబీ జట్టుపై గెలుపు అనంతరం డ్రెస్సింగ్ రూంలో ముంబై జట్టు ప్లేయర్స్ సందడి చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోను చూసిన నెటిజన్లు ముంబై జట్టు సభ్యులందరూ కలిసేఉన్నారని, వారిలో ఎలాంటి విబేధాలు లేవన్న విషయం స్పష్టమవుతోందని కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఫ్యాన్స్ అయితే, జట్టు సభ్యులందరూ కలిసిపోయి సరదాగా ఉండటంతో తమ సంతోషాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
Also Read : IPL 2024 : కుల్దీప్.. బాల్‌ను ఇలా తిప్పితే ఆడేదెట్ల! పూరన్‌కు దిమ్మతిరిగిపోయింది.. వీడియో వైరల్
Dressing room vibes after a big W are just ✨ 𝐢𝐦𝐦𝐚𝐜𝐮𝐥𝐚𝐭𝐞 ✨#MumbaiMeriJaan #MumbaiIndians #MIvRCB pic.twitter.com/deHL3Hoivm
— Mumbai Indians (@mipaltan) April 12, 2024