Rishabh Pant: అక్కడ డబ్బు ముఖ్యం కాదు.. సునీల్ గావస్కర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రిషబ్ పంత్

ఢిల్లీ జట్టు రిషబ్ పంత్ లాంటి ఆటగాడిని ఎందుకు రిటైన్ చేసుకోలేదనే విషయంపై పలువురు మాజీలు పలు కారణాలను చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడారు.

Rishabh Pant

IPL 2025 Rishabh Pant : ఐపీఎల్ 2025 మెగా వేలంపై అందరి దృష్టి ఉంది. ఐపీఎల్ ప్రాంచైజీ యాజమాన్యాలు రిటైన్ చేసుకోని ఆటగాళ్లను ఎవరు దక్కించుకుంటారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా రిషబ్ పంత్ ఈసారి ఏ జట్టులోకి వెళ్తాడన్న అంశంపైనా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ లో ఢిల్లీ కెప్టెన్ గా రిషబ్ పంత్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. అయితే, 2025 సీజన్ కుగాను పంత్ ను ఆ జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈనెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో నిర్వహించనున్న వేలంలో రిషబ్ పంత్ ను ఏ జట్టు యాజమాన్యం దక్కించుకుంటుంది. ఎంత ధరను చెల్లిస్తారనే విషయం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

Also Read: IND vs AUS Test Series: ఆస్ట్రేలియా, భారత్ మొదటి టెస్టు.. ఏ సమయానికి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.. సెషన్స్ టైమింగ్స్ వివరాలు ఇలా..

ఇదిలాఉంటే.. ఢిల్లీ జట్టు రిషబ్ పంత్ లాంటి ఆటగాడిని ఎందుకు రిటైన్ చేసుకోలేదనే విషయంపై పలువురు మాజీలు పలు కారణాలను చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడారు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గావస్కర్ మాట్లాడుతూ.. రిటెన్షన్ ఫీజు విషయంలో పంత్ ఫ్రాంచైజీతో విభేదించి ఉండొచ్చని పేర్కొన్నాడు. అయితే, మెగా వేలంలో ఢిల్లీనే కచ్చితంగా పంత్ ను కొనుగోలు చేసుకుంటుందని, ఎందుకంటే వారికి కెప్టెన్ కావాలి. పంత్ తమ జట్టులో లేకుంటే వారు కొత్త కెప్టెన్ కోసం అన్వేషించాలి అంటూ సునీల్ గావస్కర్ పేర్కొన్నారు.

 

సునీల్ గావస్కర్ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో రిషబ్ పంత్ స్పందించాడు. గావస్కర్ మాట్లాడిన వీడియోకు పంత్ కామెంట్ పెట్టాడు. నేను ఢిల్లీ ప్రాంఛైజీని వీడటానికి డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. నా రిటెన్షన్ కు, డబ్బుకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను అంటూ గావస్కర్ వ్యాఖ్యలకు పంత్ కౌంటర్ ఇచ్చాడు.