Rishabh Pant hits no look six off Pat Cummins in Perth Test
IND vs AUS : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి (41), రిషబ్ పంత్ (37) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో పంత్ కొట్టిన ఓ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
భారత ఇన్నింగ్స్ 42 ఓవర్‌ను పాట్ కమిన్స్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌గా వేశాడు. పంత్ పూర్తి ఆఫ్‌సైడ్‌కు వచ్చి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ దిశగా స్కూప్ షాట్ ఆడాడు. నియంత్రణ కోల్పోయి కిందపడిపోడిపోయాడు. అతడు కిందపడిన కొన్ని సెకన్ల తరువాత బంతి స్టాండ్స్‌లో పడింది.
IND vs AUS : పెర్త్ టెస్టు.. చేతులెత్తేసిన బ్యాటర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 ఆలౌట్..
పంత్ కొట్టిన ఈ షాట్‌ను కామెంటేటర్స్ మెచ్చుకున్నారు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా తన సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ పంత్ కు మాత్రమే ఇలాంటి షాట్ సాధ్యం అంటూ రాసుకొచ్చింది.
ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 42/5 తో నిలిచింది. మార్నస్ లబుషేన్ (2), అలెక్స్ క్యారీ (3)లు క్రీజులో ఉన్నారు. భారత స్కోరుకు ఆసీస్ ఇంకా 108 పరుగులు వెనుకబడి ఉంది.
As only Rishabh Pant can do! 6️⃣#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/vupPuWA8GG
— cricket.com.au (@cricketcomau) November 22, 2024