IND vs AUS : ఐపీఎల్ వేలం సంగ‌తేంది..? టెస్టు మ్యాచ్ జ‌రుగుతుంటే పంత్ ను అడిగిన నాథ‌న్ లియాన్‌.. ఆన్స‌ర్ ఆదుర్స్‌..

ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

IND vs AUS : ఐపీఎల్ వేలం సంగ‌తేంది..? టెస్టు మ్యాచ్ జ‌రుగుతుంటే పంత్ ను అడిగిన నాథ‌న్ లియాన్‌.. ఆన్స‌ర్ ఆదుర్స్‌..

Rishabh Pant and Nathan Lyon involved in a hilarious banter on IPL Auction 2025

Updated On : November 22, 2024 / 12:06 PM IST

IND vs AUS : ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆట‌గాళ్లు ఒక్క‌సారైనా ఈ లీగ్‌లో ఆడాల‌ని అనుకుంటారు అంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ఇదిలా ఉంటే.. భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోపీలో భాగంగా పెర్త్ వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ బౌల‌ర్ల ధాటికి టీమ్ఇండియా బ్యాట‌ర్లు త‌డ‌బ‌డుతున్నారు. కాగా.. తొలి సెష‌న్‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది.

IND vs AUS : ఆసీస్‌తో తొలి టెస్టు.. శుభ్‌మ‌న్ గిల్ ఎందుకు ఆడ‌డం లేదు..

క్రీజులో రిష‌బ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండ‌గా.. ఫీల్డ్ పేస్‌మెంట్ ఛేంజ్‌లో భాగంగా ఆసీస్ స్పిన్న‌ర్ నాథన్ లియోన్ ఓ వైపు నుంచి మ‌రో వైపుకు వెలుతూ పంత్‌తో మాట్లాడాడు. వేలంలో మ‌నం ఎక్క‌డికి వెళ్తున్నాం? అని లియోన్ పంత్‌ను అడిగాడు. ఇందుకు పంత్ ‘నో ఐడియా’ అంటూ స‌మాధానం ఇచ్చారు. వీరిద్ద‌రి సంభాష‌ణ స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ప్ర‌స్తుతం భార‌త స్కోరు 41 ఓవ‌ర్ల‌కు 108/6గా ఉంది. నితీశ్ రెడ్డి (22), రిష‌బ్ పంత్ (30) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. య‌శ‌స్వి జైస్వాల్, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ లు డ‌కౌట్లు అయ్యారు. కోహ్లీ (5), ధ్రువ్ జురెల్ (11), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (4) లు విఫ‌లం అయ్యారు. కేఎల్ రాహుల్ 26 ప‌రుగులు చేశాడు.

IND vs AUS : కేఎల్ రాహుల్ ఔటా? నాటౌటా? థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యం పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు..