IND vs AUS : ఆసీస్‌తో తొలి టెస్టు.. శుభ్‌మ‌న్ గిల్ ఎందుకు ఆడ‌డం లేదు..

శుభ్‌మ‌న్ గిల్ మ్యాచ్‌లో ఆడ‌తాడ‌ని భావించ‌గా తుది జ‌ట్టులో అత‌డికి చోటు ద‌క్క‌లేదు.

IND vs AUS : ఆసీస్‌తో తొలి టెస్టు.. శుభ్‌మ‌న్ గిల్ ఎందుకు ఆడ‌డం లేదు..

Shubman Gill

Updated On : November 22, 2024 / 11:13 AM IST

IND vs AUS : బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య పెర్త్ వేదిక‌గా శుక్ర‌వారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ జ‌స్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి, హ‌ర్షిత్ రాణాలు ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేశారు.

కాగా.. కెప్టెన్, స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేని సంగ‌తి తెలిసిందే. ఇక శుభ్‌మ‌న్ గిల్ మ్యాచ్‌లో ఆడ‌తాడ‌ని భావించ‌గా తుది జ‌ట్టులో అత‌డికి చోటు ద‌క్క‌లేదు. దీనిపై బీసీసీఐ స్ప‌ష్ట‌త ఇచ్చింది. గాయం నుంచి అత‌డు ఇంకా కోలుకోలేద‌ని వెల్ల‌డించింది. అందుక‌నే తొలి టెస్టుకు ఎంపిక చేయ‌లేద‌ని, అత‌డి గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని చెప్పింది.

IND vs AUS : కేఎల్ రాహుల్ ఔటా? నాటౌటా? థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యం పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు..

‘వాకాలో వార్మ‌ప్ మ్యాచ్ సంద‌ర్భంగా శుభ్‌మ‌న్ గిల్ చేతి వేలికి గాయ‌మైంది. అత‌డు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుక‌నే తొలి టెస్టుకు ఎంపిక చేయ‌లేదు. బీసీసీఐ వైద్య బృందం నిరంత‌రం అత‌డి ప‌రిస్థితిని గ‌మ‌నిస్తూనే ఉంది.’ అని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

కాగా.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాట‌ర్లు త‌డ‌బ‌డుతున్నారు. ఆసీస్ బౌల‌ర్ల ధాటికి పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్‌, వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ లు డ‌కౌట్లు అయ్యారు. విరాట్ కోహ్లీ 5 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 26 ప‌రుగులు చేసిన కేఎల్ రాహుల్ వివాదాస్ప‌ద నిర్ణ‌యంతో ఔటైయ్యాడు. ఎన్నో అంచ‌నాల‌తో దిగిన ధ్రువ్ జురెల్ 11 ప‌రుగులే చేశాడు.

IND vs AUS : బంతిని ఆడాలా వ‌ద్దా అన్న అయోమ‌యంలో ఔటైన కోహ్లీ!.. పేల‌వ ఫామ్‌ కంటిన్యూ..

టీమ్ఇండియా ప్ర‌స్తుతం 31 ఓవ‌ర్ల‌కు 71/5తో నిలిచింది. రిష‌బ్ పంత్ (17), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (4) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.