IND vs AUS : బంతిని ఆడాలా వద్దా అన్న అయోమయంలో ఔటైన కోహ్లీ!.. పేలవ ఫామ్ కంటిన్యూ..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు.

IND vs AUS Virat Kohli fails on his Australia return as Josh Hazlewood delivers a peach
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన ఆసీస్ గడ్డపైనా విఫలం అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత ఏడాదిగా టెస్టుల్లో భీకర ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 8 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 27 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో ఎన్నో అంచనాలతో క్రీజులో అడుగుపెట్టాడు విరాట్ కోహ్లీ. ఆసీస్ గడ్డ పైన ఫామ్ అందుకుంటాడు అని అనుకుంటే అది జరగలేదు. 12 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 5 పరుగులు చేసి హేజిల్ వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు.
హేజిల్ వుడ్ షార్ట్ బాల్ వేయగా.. అది కోహ్లీ ఊహించన దానికంటే అదనపు బౌన్స్ అయింది. బంతిని వదిలేద్దామని కోహ్లీ బ్యాట్‌ను పక్కకు అనేలోపే ఎడ్జ్‌ను తీసుకున్న బంతి తొలి స్లిప్‌లో ఉన్నఉస్మాన్ ఖవాజా చేతుల్లోకి వెళ్లింది. దీంతో భారత్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత స్కోరు 22 ఓవర్లకు 47/3. కేఎల్ రాహుల్ (26), రిషబ్ పంత్ (10) లు క్రీజులో ఉన్నారు.
AUS vs IND : భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
కాగా.. కోహ్లీ ఔట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Extra bounce from Hazlewood – Kohli’s back in the sheds for five #AUSvIND pic.twitter.com/6M5DjgOqrV
— cricket.com.au (@cricketcomau) November 22, 2024