AUS vs IND : భార‌త్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ మ‌రికొన్ని గంట‌ల్లో ఆరంభం కానుంది.

AUS vs IND : భార‌త్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?

Do You Know How To Watch Australia vs India Test series free in ott and channel

Updated On : November 22, 2024 / 9:50 AM IST

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ మ‌రికొన్ని గంట‌ల్లో ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో బాగంగా శుక్ర‌వారం నుంచి పెర్త్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 7.50 గంట‌ల ప్రారంభం కానుంది. మ‌ధ్యాహ్నాం 2.50 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

తొలి సెషన్ ఉద‌యం 7.50 నుంచి 9.50 వరకు, రెండో సెషన్ ఉద‌యం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మూడో సెషన్ మధ్యామ్నం 12.50 నుంచి 2.50 గంటల వరకు జరుగుతుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ)లో ఫైన‌ల్ చేరుకోవాలంటే ఆసీస్‌ సిరీస్‌ భార‌త్‌కు ఎంతో కీల‌కం. ఐదు మ్యాచుల ఈ సిరీస్‌ను 4-0 తేడాతో గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండా భార‌త్ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. అటు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ కీల‌కం కావ‌డంతో.. మ్యాచులు హోరా హోరీగా జ‌ర‌గ‌నున్నాయి.

AUS vs IND : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. తొలి టెస్టు మ్యాచ్‌లోనే జ‌ట్టుతో చేర‌నున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌!

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్ షెడ్యూల్ ఇదే..

తొలి టెస్టు – నవంబ‌ర్ 22 నుంచి 26 వ‌ర‌కు – వేదిక పెర్త్ (భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 7.50 గంట‌ల‌కు ప్రారంభం)
రెండో టెస్టు – డిసెంబ‌ర్ 6 నుంచి 10 వ‌ర‌కు – అడిలైడ్ (భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్రారంభం)
మూడో టెస్టు – డిసెంబ‌ర్ 14 నుంచి 18 వ‌ర‌కు – బ్రిస్బేన్ (భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 5.50 గంట‌ల‌కు ప్రారంభం)
నాలుగో టెస్టు – డిసెంబ‌ర్ 26 నుంచి 30 వ‌ర‌కు – మెల్‌బోర్న్ (భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 5 గంట‌ల‌కు ప్రారంభం)
ఐదో టెస్టు – జ‌న‌వ‌రి 3 నుంచి 7 వ‌ర‌కు – సిడ్నీ (భార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 5 గంట‌ల‌కు ప్రారంభం)

ఫ్రీగా ఎలా చూడొచ్చంటే..?
ఈ సిరీస్‌ను స్టార్‌స్పోర్ట్స్ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేస్తోంది. టీవీల్లో స్టార్‌స్పోర్ట్స్‌1, స్టార్‌స్పోర్ట్స్‌1 హెచ్‌డీ, స్టార్‌స్పోర్ట్స్‌2, స్టార్‌స్పోర్ట్స్‌2 హెచ్‌డీ ఛానెల్స్‌ల్లో చూడొచ్చు. డీడీ స్పోర్ట్స్‌లో ఉచితంగా ప్రసారం అవుతుంది. ఇక ఆన్‌లైన్‌లో డిస్నీ+హాట్‌స్టార్ వీక్షించ‌వొచ్చు.

AUS vs IND : తొలి టెస్టుకు అంపైర్లు వీరే.. టీమ్ఇండియా ఇక గెలిచిన‌ట్లే? ఈ అంఫైర్ ఉన్నాడంటే..