AUS vs IND : తొలి టెస్టుకు అంపైర్లు వీరే.. టీమ్ఇండియా ఇక గెలిచినట్లే? ఈ అంఫైర్ ఉన్నాడంటే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబర్ 22 శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

IND vs AUS 1st Test these two are the on field umpires in Perth test
AUS vs IND : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబర్ 22 శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిరీస్ ప్రారంభం సందర్భంగా గురువారం ఇరు జట్ల కెప్టెన్లు పాట్ కమిన్స్, జస్‌ప్రీత్ బుమ్రాలు ట్రోఫీని ఆవిష్కరించారు.
ఇటు ఐసీసీ అంపైర్ల జాబితాను ప్రకటించింది. తొలి టెస్టుకు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో, న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ లు వ్యవహరించనున్నారు. ఈ విషయం తెలిసి భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరుకోవాలంటే ఈ సిరీస్ భారత్ కు ఎంతో ముఖ్యం. ఈ సిరీస్ భారత్ 4-0 తేడాతో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అందుకనే పెర్త్ టెస్టులో గెలిచి ఈ సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. అయితే.. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో ఉన్నాడని తెలిసి టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఐసీసీ నాకౌట్ మ్యాచులతో పాటు భారత్ ఓడిపోయిన ఎన్నో ముఖ్యమైన మ్యాచుల్లో రిచర్డ్ కెటిల్‌బరోనే అంపైర్‌గా ఉన్నాడు. దీంతో అతడు మ్యాచ్‌లో ఉన్నాడంటే భారత్ ఓడిపోతుందని కొందరు భావిస్తూ ఉంటారు. తొలి టెస్టుకు అతడే అంపైర్ అని తెలిసి ఇక భారత్ మ్యాచ్ గెలిచినట్లే అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
Umpire Injury : అరెరె.. ఎంత పనాయెరా.. స్ట్రెయిట్ డ్రైవ్ ఇలా ఆడతారా.. ఆసీస్ అంపైర్ ముఖం పగిలింది..
బోర్డర్ గవాస్కర్ సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – నవంబర్ 22 నుంచి 26 వరకు – వేదిక పెర్త్
రెండో టెస్టు – డిసెంబర్ 6 నుంచి 10 వరకు – అడిలైడ్
మూడో టెస్టు – డిసెంబర్ 14 నుంచి 18 వరకు – బ్రిస్బేన్
నాలుగో టెస్టు – డిసెంబర్ 26 నుంచి 30 వరకు – మెల్‌బోర్న్
ఐదో టెస్టు – జనవరి 3 నుంచి 7 వరకు – సిడ్నీ
🚨 THE ON FIELD UMPIRES…!!! 🚨
– Richard Kettleborough and Chris Gaffaney will be on-field for the 1st Test between India and Australia. 🇮🇳🏆 pic.twitter.com/1eJiEXWoNb
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 21, 2024