AUS vs IND : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. తొలి టెస్టు మ్యాచ్‌లోనే జ‌ట్టుతో చేర‌నున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌!

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా శుక్ర‌వారం నుంచి భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

AUS vs IND : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. తొలి టెస్టు మ్యాచ్‌లోనే జ‌ట్టుతో చేర‌నున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌!

Rohit Sharma to join Team India on Day 3 in Perth test

Updated On : November 21, 2024 / 5:31 PM IST

AUS vs IND : బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా శుక్ర‌వారం నుంచి భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. రెండో బిడ్డ జ‌న్మించ‌డంతో తొలి టెస్టు మ్యాచ్‌కు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ దూరంగా ఉన్నారు. అత‌డు జ‌ట్టుతో క‌లిసి ఆస్ట్రేలియాకు వెళ్ల‌లేదు. భార‌త్‌లోనే ఉండిపోయాడు. అత‌డు ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ల‌నున్నాడు అనే దానిపై కాస్త క్లారిటీ వ‌చ్చింది. తొలి టెస్టు మూడో రోజు అంటే న‌వంబ‌ర్ 24న అత‌డు భార‌త జ‌ట్టులో క‌లుస్తాడ‌ని క్రిక్‌బ‌జ్ త‌న క‌థ‌నంలో తెలిపింది.

వాస్త‌వానికి తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్ 22) ప్రారంభం అయ్యే రోజు నాటికే రోహిత్ జ‌ట్టుతో ఉంటాడ‌ని కొన్ని నివేదికలు సూచించాయి. అయితే.. అత‌డు రెండు రోజుల ఆల‌స్యంగా ఆదివారం జట్టులో చేరతానని బీసీసీఐకి చెందిన అధికారులు తెలిపిన‌ట్లు చెప్పింది.

AUS vs IND : తొలి టెస్టుకు అంపైర్లు వీరే.. టీమ్ఇండియా ఇక గెలిచిన‌ట్లే? ఈ అంఫైర్ ఉన్నాడంటే..

డిసెంబ‌ర్ 6 నుంచి 10 వ‌ర‌కు అడిలైడ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు నుంచి రోహిత్ శ‌ర్మ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. ఇక మ్యాచ్ స‌న్న‌ద్ధ కోసం న‌వంబ‌ర్ 30, డిసెంబ‌ర్ 1న కాన్‌బెర్రాలోని మ‌నుకా స్టేడియంలో ప్రైమ్ మినిస్ట‌ర్స్‌XIతో రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌ను రోహిత్ ఆడ‌నున్నాడు. అత‌డు భార‌త్ ఏ జ‌ట్టు త‌రుపున బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టుకు ఐసీసీ అంపైర్ల జాబితాను ప్ర‌క‌టించింది. తొలి టెస్టుకు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో, న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ లు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ విష‌యం తెలిసి భార‌త అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. కెటిల్ బ‌రో అంపైర్ గా వ్య‌వ‌హ‌రించిన చాలా మ్యాచుల్లో భార‌త్ ఓడిపోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

AUS vs IND : ఏమ‌ప్పా భార‌త ఆట‌గాళ్ల‌ను అలా తీసిపారేశావే.. ఒక్క‌రిలో కూడా స‌త్తా లేదా? నువ్వు ఆసీస్ కెప్టెన్‌ అయితే మాత్రం..