Rishabh Pant : కెప్టెన్‌గా, వికెట్ కీప‌ర్‌గా అదరగొట్టిన రిషబ్ పంత్.. వీడియోలు వైరల్

వికెట్ల వెనుక పంత్ రెండు చక్కటి క్యాచ్ లు అందుకున్నాడు. అంతేకాదు.. ఒకే ఓవర్లో ఇద్దరిని మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి ఔరా అనిపించాడు. ఐదో ఓవర్లో గుజరాత్ కీలక బ్యాటర్ డేవిడ్ మిల్లర్

IPL 2024 DC vs GT : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. బుధవారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ బౌలర్ల దాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. 90 ప‌రుగుల స్వ‌ల్ప లక్ష్యంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా.. కేవలం 8.5 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. కెప్టెన్ గా, కీపర్ గా రాణించాడు.

Also Read : GT vs DC : పంత్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. 89 ప‌రుగుల‌కే గుజ‌రాత్ ఆలౌట్‌

రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు 15నెలల పాటు రిషబ్ పంత్ క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి మైదానంలోని దిగాడు. అయితే, చాలాకాలం తరువాత ఐపీఎల్ లో ఆడుతున్న పంత్.. గతంలోలా ఆడతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పంత్ అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ గతంలోలా బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీలోనూ తన ప్రతిభను చాటుతున్నాడు. తాజాగా, బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పంత్ అద్భుత ప్రతిభ కనబర్చాడు. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా గొప్ప నైపుణ్యం చూపించాడు. అతడి బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి.

Also Read : Kris Srikkanth : ఆర్‌సీబీ గెల‌వాలంటే.. 11 మంది బ్యాట‌ర్ల‌తో బ‌రిలోకి.. కోహ్లి బౌలింగ్

వికెట్ల వెనుక పంత్ రెండు చక్కటి క్యాచ్ లు అందుకున్నాడు. అంతేకాదు.. ఒకే ఓవర్లో ఇద్దరిని మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి ఔరా అనిపించాడు. ఐదో ఓవర్లో గుజరాత్ కీలక బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (2) ఇషాంత్ శర్మ బౌలింగ్ లో వికెట్ల వెనుకాల రిషబ్ పంత్ అద్భుత క్యాచ్ అందుకోవటంతో పెవిలియన్ బాటపట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ స్పిన్ బౌలింగ్ లో అభినవ్ మనోహర్ (8)ను రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షారుఖ్ ఖాన్ ను రిషబ్ పంత్ తెలివిగా వెనక్కి పంపాడు. పంత్ మొదట స్టబ్స్ వేసిన వైడ్ డెలివరీలో క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. ఆపై బంతి వికెట్లను తాకడంతో స్మార్ట్ స్టంపింగ్ చేశాడు. పంత్ వికెట్ల వినుకాల స్టంపింగ్స్ , క్యాచ్ తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు