Rishabh Pant : శ్రీలంకతో టెస్టు సిరీస్.. రిషబ్ పంత్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు.. తొలి భారత ప్లేయర్‌గా..
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు రిషబ్ పంత్‌ను (Rishabh Pant) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది
- Thota Vamshi Kumar
- Published on- August 11, 2026 / 02:34 PM IST
Rishabh Pant needs 3 sixes to create history in Sri Lanka
Rishabh Pant : ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో పంత్ మూడు సిక్సర్లు కొడితే.. టెస్టు క్రికెట్‌లో వంద సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. అంతేకాదండోయ్.. టెస్టుల్లో టీమ్ఇండియా తరుపున 100 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
2018లో టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 50 టెస్టులు ఆడాడు. 43.47 సగటుతో 3557 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు అతడు మొత్తం 97 సిక్సర్లు బాదాడు.
కాగా.. గాలె వేదికగా శనివారం నుంచి శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనే పంత్ మూడు సిక్సర్లు కొట్టే అవకాశం ఉంది.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు వీరే..
* రిషబ్ పంత్ – 50 మ్యాచ్‌ల్లో 97 సిక్సర్లు
* వీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
* రోహిత్ శర్మ – 67 మ్యాచ్‌ల్లో 88 సిక్సర్లు
* రవీంద్ర జడేజా – 89 మ్యాచ్‌ల్లో 82 సిక్సర్లు
* ఎంఎస్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు
* సచిన్ టెండూల్కర్ – 200 మ్యాచ్‌ల్లో 69 సిక్సర్లు
