BCCI President: బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ పేసర్ రోజర్ బిన్నీ?

బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ పేసర్ రోజర్ బిన్నీ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సౌరవ్ గంగూలీ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ పదవిని చేపట్టబోయేది ఎవరన్న అంశంపై పలువురి పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. రోజర్ బిన్నీ 1983లో ప్రపంచ కప్ సాధించినన భారత జట్టులోని సభ్యుడు.

BCCI President: బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ పేసర్ రోజర్ బిన్నీ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సౌరవ్ గంగూలీ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ పదవిని చేపట్టబోయేది ఎవరన్న అంశంపై పలువురి పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. రోజర్ బిన్నీ 1983లో ప్రపంచ కప్ సాధించినన భారత జట్టులోని సభ్యుడు.

సెలక్షన్ కమిటీ సభ్యుడిగానూ ఆయన విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం బిన్నీ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ఆఫీస్ బేరర్ గా సేవలు అందిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ 2019 అక్టోబరు నుంచి కొనసాగుతున్నారు. ఈ నెల 18న బీసీసీఐ ఎన్నికలు, వార్షిక సర్వసభ్య సమావేశం జరగనున్నాయి. ఈ సమావేశంలో ముంబైలో జరగనుంది.

బీసీసీఐ తదుపరి అధ్యక్ష ఎన్నికలకు నేడు, రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎల్లుండి వాటిని పరిశీలిస్తారు. 14న నామినేషన్ల ఉపసంహరణ, 18న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ వెంటనే బీసీసీఐ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు