ఐడీ కార్డు లేదని ఫెదరర్‌ను ఆపేశారట

టెన్నిస్ ప్రపంచంలో రారాజు, స్విస్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అక్రిడేషన్ కార్డు మర్చిపోయినందుకు ఫెదరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లకుండా అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు.

టెన్నిస్ ప్రపంచంలో రారాజు, స్విస్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అక్రిడేషన్ కార్డు మర్చిపోయినందుకు ఫెదరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లకుండా అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు.

టెన్నిస్ ప్రపంచంలో రారాజు, స్విస్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అక్రిడేషన్ కార్డు మర్చిపోయినందుకు ఫెదరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లకుండా అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. ఫలితంగా 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేత ఫెదరర్ కూడా నేనే ‘రోజర్ ఫెదరర్’ అని ఫెడ్డీ నిరూపించుకోవాల్సి వచ్చింది. ఫెదరర్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో ఐడీ కార్డు లేదన్న కారణంతో ఓ సెక్యూరిటీ గార్డు నిలిపేశాడు. 

సెక్యూరిటీ గార్డు తనను నిలిపివేయడంపై ఫెదరర్ ఎటువంటి అసహనం వ్యక్తం చేయలేదు. సిబ్బంది దగ్గర ఉన్న ఐడీ కార్డును తెప్పించుకుని చూపించిన తర్వాత లోనికి వెళ్లాడు. ఇళా తన స్వభావాన్ని చెప్పకనే చెప్పాడు. కాగా, పోస్టు చేసిన కాసేపటిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది. 

రోజర్ ఫెదరర్‌కి కూడా అక్రిడేషన్ కావాలంటూ ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. ఆ గుర్తింపు కార్డుపై సంబంధిత వ్యక్తుల ప్రాథమిక సమాచారంతోపాటు బార్ కోడ్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ చెక్ పాయింట్లలో దాన్ని స్కాన్ చేస్తారు. 

ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో రష్యా ప్లేయర్ మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు లేదనే కారణంతో కారిడార్లోనే నిలిపేశారు. ఆదివారం ముగిసిన ప్రి క్వార్టర్స్ ఫైనల్స్‌లో ఫెదరర్ గ్రీసుకు చెందిన స్టెఫనోస్ ట్సిట్సిపాస్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.