Site icon 10TV Telugu

Rohit Sharma : ల‌గ్జ‌రీ కారును కొన్న రోహిత్ శ‌ర్మ.. ధ‌ర తెలుస్తే షాకే.. 3015 నంబ‌ర్ ప్లేట్ వెనుక ఉన్న అస‌లు క‌థ అదేనా..

Rohit Sharma Another Lamborghini Urus With Special Number Plate 3015

Rohit Sharma Another Lamborghini Urus With Special Number Plate 3015

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు కార్లంటే చాలా ఇష్టం అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇటీవ‌ల హిట్‌మ్యాన్ మ‌రో ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేశాడు. లంబోర్గిని ఉరస్ కారును కొన్నాడు. ఈ కారు ధ‌ర ఎక్స్‌-షోరూంలో రూ. 4.57కోట్లుగా ఉంది.

కాగా.. గతంలో హిట్‌మ్యాన్‌ దగ్గర ఉన్న నీలి రంగు లాంబోర్ఘిని ఉరస్ కారుకు భిన్నంగా.. ఈ సారి ఆయన ఆరెంజ్ కలర్ కారును ఎంచుకున్నారు. కాగా.. త‌న పాత కారును డ్రీమ్ 11 ఫాంట‌సీ క్రికెట్ పోటీ విజేత‌కు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కొత్త మోడల్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రైయిన్, మరింత మెరుగైన పనితీరు, అనేక డిజైన్ అప్‌డేట్లు ఉన్నాయి.

Sanju Samson : మ్యాచ్ రాత్రి 8 గంట‌ల‌కు అయితే సాయంత్రం 5 గంట‌ల‌కు నిద్ర లేస్తాడు.. రాజ‌స్థాన్ హిట్ట‌ర్ గురించి సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ఇక ఈ కారు కోసం రిజిస్ట్రేషన్ నంబర్ 3015 తీసుకున్నాడు. ప్ర‌స్తుతం దీనిపైనే అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది. ఇది అత‌డి ఇద్ద‌రు పిల్ల‌ల పుట్టిన తేదీల‌ను తెలియ‌జేస్తుంది. కూతురు స‌మైరా 30 డిసెంబ‌ర్ 2018లో జ‌న్మించ‌గా, కుమారుడు అహ‌న్ న‌వంబ‌ర్ 15 జ‌న్మించాడు.

కాగా.. రోహిత్ శ‌ర్మకు గ‌తంలో ఉన్న లంబోర్గిని కారు నంబ‌ర్ 264 అన్న సంగ‌తి తెలిసిందే. ఇది వ‌న్డేల్లో అత‌డి అత్య‌ధిక స్కోరు అన్న సంగ‌తి తెలిసిందే.

అంత‌ర్జాతీయ క్రికెట్‌టో టీ20లు, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ శ‌ర్మ కేవ‌లం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ సాధించ‌డం త‌న క‌ల అని ప‌లు సంద‌ర్భాల్లో హిట్‌మ్యాన్ వెల్ల‌డించాడు. ఈ క్ర‌మంలో 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకుని స‌గ‌ర్వంగా రిటైర్ కావాల‌ని అత‌డి అభిమానులు కోరుకుంటున్నారు.

Rajat Patidar SIM Mishap : చ‌త్తీస్‌గ‌డ్ కుర్రాడికి వ‌రుస బెట్టి కాల్స్ చేసిన కోహ్లీ, డివిలియ‌ర్స్‌, ర‌జ‌త్ పాటిదార్ ఇంకా.. ఎందుకో తెలుసా?

అయితే.. ఈ మెగా టోర్నీకి మ‌రో రెండేళ్లకు పైగా స‌మ‌యం ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ఫిట్‌నెస్‌, ఫామ్ ను కాపాడుకుంటూ రోహిత్ శ‌ర్మ వ‌న్డేల్లో కొన‌సాగుతాడా? లేదా ? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారిది. అక్టోబ‌ర్‌లో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో గ‌నుక రోహిత్ శ‌ర్మ రాణించ‌కుంటే అత‌డి పై వేటు త‌ప్ప‌ద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

Exit mobile version