Rohit Sharma completed 650 sixes in international cricket becoming the first player to achieve the milestone
Rohit Sharma : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టి హిట్‌మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ 29 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. జేమిసన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు వీరే..
* రోహిత్ శర్మ – 506 మ్యాచ్‌ల్లో 650 సిక్సర్లు
* క్రిస్ గేల్ – 483 మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు
* షాహిద్ అఫ్రిది – 524 మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లు
* బ్రెండన్ మెక్ కల్లమ్ – 432 మ్యాచ్‌ల్లో 398 సిక్సర్లు
* జోస్ బట్లర్ – 397 మ్యాచ్‌ల్లో 387 సిక్సర్లు
IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భారత్ కు భారీ షాక్..
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఓపెనర్..
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ ను అధిగమించాడు. గేల్ వన్డేల్లో ఓపెనర్‌గా 328 సిక్సర్లు కొట్టగా.. తాజా మ్యాచ్‌లో రెండు సిక్సర్లతో కలిపి హిట్‌మ్యాన్ సిక్సర్ల సంఖ్య 329కి చేరింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారెల్ మిచెల్ (84), హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ లు తలా రెండు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.
IND vs NZ : అందుకే మేం ఓడిపోయాం.. ఆ ఒక్క పని చేసుంటేనా.. కివీస్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్
ఆ తరువాత 301 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (93) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (56), శ్రేయస్ అయ్యర్ (49) లు రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు తీయగా ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ లు చెరో వికెట్ సాధించారు.