IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్ కు భారీ షాక్..

తొలి వ‌న్డేలో విజ‌యం (IND vs NZ) సాధించి జోష్‌లో ఉన్న భార‌త్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది.

IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్ కు భారీ షాక్..

Massive blow for Team India another star ruled out of ODI series against New Zealand

Updated On : January 12, 2026 / 9:37 AM IST

IND vs NZ : మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భార‌త్ ఘ‌నంగా బోణీ కొట్టింది. వ‌డోద‌ర వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. కాగా..  గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

వ‌డోద‌ర వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ గాయ‌ప‌డ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ 20 ఓవ‌ర్ వేస్తున్న స‌మ‌యంలో అత‌డు వెన్నునొప్పితో ఇబ్బంది ప‌డ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండ‌డంతో వెంట‌నే అత‌డు మైదానాన్ని వీడాడు. నితీశ్ కుమార్ రెడ్డి అత‌డికి బ‌దులుగా ఫీల్డింగ్ చేశాడు. మ‌ళ్లీ సుంద‌ర్ ఫీల్డింగ్ కు రాలేదు.

Virat Kohli : నాకు అది న‌చ్చ‌దు.. గ‌తంలో ధోని విష‌యంలోనూ ఇలాగే చేశారు.. కోహ్లీ కామెంట్స్ వైర‌ల్‌

కాగా.. బ్యాటింగ్ స‌మ‌యంలో త‌న అవ‌స‌రం ఉండ‌డంతో ఆరో వికెట్ ప‌డిన త‌రువాత క్రీజులోకి వ‌చ్చాడు. అత‌డు ఇబ్బంది ప‌డుతూనే బ్యాటింగ్ చేశాడు. రాహుల్‌కు అండ‌గా నిలిచి జ‌ట్టు విజ‌యం సాధించ‌డంలో త‌న వంతు సాయం చేశాడు.

ఈ మ్యాచ్‌లో సుంద‌ర్ 5 ఓవ‌ర్లు వేసి 27 ప‌రుగులు ఇచ్చాడు. ఇక బ్యాటింగ్‌లో 7 బంతులు ఆడి 7 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఇక మ్యాచ్ అనంత‌రం సుంద‌ర్ గాయం పై శుభ్‌మ‌న్ గిల్ మాట్లాడాడు. మ్యాచ్ అనంత‌రం అత‌డిని గాయానికి స్కానింగ్ నిర్వ‌హిస్తారని చెప్పాడు. గాయం తీవ్ర‌తను బ‌ట్టి అత‌డిని త‌దుప‌రి మ్యాచ్‌ల్లో ఆడించాలా లేదా అనే విష‌యం పై నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపాడు.

IND vs NZ : తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ పై విజ‌యం.. భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కామెంట్స్‌.. నా దృష్టి అంతా

అందుతున్న సమాచారం ప్ర‌కారం సుంద‌ర్ గాయం కాస్త తీవ్ర‌మైన‌దేన‌ని తెలుస్తోంది. దీంతో అత‌డు ఈ సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆడ‌క‌పోవ‌చ్చు.