×
Ad

Rohit Sharma : సెంచ‌రీ చేసిన త‌రువాతి రోజే రోహిత్ శ‌ర్మ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. గుడ్ బై, ఇదే చివ‌రి సారి..

రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) సెంచ‌రీ చేసిన మ‌రుస‌టి రోజే సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశాడు.

Rohit Sharma Emotional Post Day After Century In Sydney

Rohit Sharma : మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 121 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఆసీస్ గ‌డ్డ‌పై త‌న‌కు ఇదే చివ‌రి మ్యాచ్ కావొచ్చు అంటూ మ్యాచ్ అనంత‌రం రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఇక వ‌న్డే సిరీస్ పూర్తి కావ‌డంతో రోహిత్ శ‌ర్మ స్వ‌దేశానికి బ‌య‌లుదేరాడు. సిడ్నీ న‌గ‌రానికి వీడ్కోలు చెబుతున్నాను అనే క్యాప్ష‌న్‌తో గుడ్ బై చెబుతున్న ఫోటోను పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అచ్చొచ్చిన సిడ్నీ గ్రౌండ్‌..

రోహిత్ శ‌ర్మకు సిడ్నీ మైదానం ఎంతో అచ్చొచ్చింది. మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి ఇక్క‌డ హిట్‌మ్యాన్ 13 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 62.66 స‌గ‌టుతో 752 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, ఆరు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక ఈ మైదానంలో 64 ఫోర్లు, 24 సిక్స‌ర్ల‌ను బాదాడు.

Womens World Cup 2025 : ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..

మ‌ళ్లీ ఆడుతామో లేదో తెలియ‌దు..

ఆసీస్‌తో మూడో వ‌న్డే ముగిసిన త‌రువాత రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. తాను ఆస్ట్రేలియాకు రావ‌డాన్ని ఎప్పుడూ ఇష్ట‌ప‌డుతాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక స్నిడీలో మ్యాచ్‌లు ఆడ‌టాన్ని ఆస్వాదిస్తాన‌ని అన్నాడు. 2008లో తాను తొలిసారి ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చాన‌ని, అప్ప‌టి నుంచి ఇక్క‌డ మ‌ధుర జ్ఞాప‌కాలు ఉన్నాయ‌న్నాడు. ఈ ప‌ర్య‌ట‌న కూడా ఎంతో స‌ర‌దాగా ఉంద‌న్నాడు.

తాము (కోహ్లీ, రోహిత్‌) క్రికెట‌ర్లుగా మ‌ళ్లీ ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తామో లేదో త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా తాను ఇక్క‌డ ఆడిన ప్ర‌తి క్ష‌ణాన్ని ఎంతో ఆస్వాదించాన‌ని అన్నాడు. ఆసీస్ గ‌డ్డ‌పై ఆడ‌డం త‌న‌కు ఎల్ల‌ప్పుడూ ఇష్ట‌మేన‌ని, కోహ్లీకి కూడా ఇలాగే ఉంటుంద‌ని తాను భావిస్తున్న‌ట్లుగా తెలిపాడు.