Womens World Cup 2025 : ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో (Womens World Cup 2025) సెమీఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది.

Womens World Cup 2025 : ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..

Big shock to indian women team ahead of semis match Pratika Rawal Injury

Updated On : October 27, 2025 / 9:47 AM IST

Womens World Cup 2025 : మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో సెమీఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. భీక‌ర ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ ప్ర‌తీకా రావ‌త్ గాయ‌ప‌డింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఆమె గాయ‌ప‌డింది. తీవ్ర‌మైన నొప్పితో ఆమె మైదానాన్ని వీడింది. మ‌ళ్లీ మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్ట‌లేదు.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఫ‌లితం తేల‌లేదు. 27 ఓవ‌ర్ల‌కు కుదించిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవ‌ర్లో బంగ్లాదేశ్ 9 వికెట్ల న‌ష్టానికి 119 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల స్పిన్న‌ర్లు రాధ యాద‌వ్ మూడు వికెట్లు తీయ‌గా.. శ్రీచ‌ర‌ణి రెండు వికెట్లు పడ‌గొట్టింది. ఆ త‌రువాత డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో భార‌త ల‌క్ష్యాన్ని 126 ప‌రుగుల‌కు స‌వ‌రించారు. వ‌ర్షం వ‌ల్ల ఆట నిలిచిపోయే స‌మ‌యానికి భార‌త్ 8.4 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోకుండా 57 ప‌రుగులు చేసింది. స్మృతి మంధాన (34 నాటౌట్‌), అమ‌న్ జ్యోత్ కౌర్ (15 నాటౌట్‌) లు రాణించారు. వ‌ర్షం ఆగిన‌ప్ప‌టికి మ్యాచ్‌ను కొన‌సాగించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో ర‌ద్దు చేశారు. ఇరు జ‌ట్ల‌కు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మ‌ళ్లీ ఆసీస్‌లో ఆడ‌తామో లేదో తెలియ‌దు..

గాయ‌ప‌డిన ప్ర‌తీకా..

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో ప్ర‌తీకా రావ‌త్ గాయ‌ప‌డింది. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి మిడ్ వికెట్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ గాయప‌డింది. ర‌న్నింగ్ చేస్తున్న క్ర‌మంలో మైదానంలో చిత్త‌డిగా ఉండ‌డంతో ప్ర‌తీకారావ‌త్ కుడికాలు మడిమ మ‌డ‌త‌ప‌డింది. దీంతో ఆమె తీవ్ర నొప్పితో బాధ‌ప‌డింది. వైద్య సిబ్బంది సాయంతో ఆమె కుంటుతూ మైదానాన్ని వీడింది. ఈ మ్యాచ్‌లో మ‌ళ్లీ ఆమె మైదానంలో అడుగుపెట్ట‌లేదు. ఆమె స్థానంలో అమన్‌జోత్ కౌర్ భార‌త ఇన్నింగ్స్ ప్రారంభించింది.

‘ఫీల్డింగ్ చేస్తూ ప్రతీక రావల్‌ మోకాలు, చీలమండకు గాయాలయ్యాయి. వైద్య సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆమె ఉంది.’ అని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

Shubman Gill : వ‌న్డే కెప్టెన్‌గా తొలి విజ‌యం.. శుభ్‌మ‌న్ గిల్ కామెంట్స్‌.. హ‌ర్షిత్ రాణా మా కోసం..

ఇంత‌కు మించి ప్ర‌తీకా గాయం తీవ్ర‌త‌పై ఇంత‌వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఒక‌వేళ ఆమెగాయం తీవ్ర‌మై సెమీఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం అయితే అది భార‌త జ‌ట్టుకు తీవ్ర ఎదురుదెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు. కివీస్‌తో జ‌రిగిన గ‌త మ్యాచ్‌లో ప్ర‌తీకా సెంచ‌రీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మెగాటోర్నీలో (Womens World Cup 2025) స్మృతి మంధానతో క‌లిసి ఆమె జ‌ట్టుకు శుభారంభాలు ఇస్తుంది.

భార‌త జ‌ట్టు సెమీస్‌లో ప‌టిష్ట‌మైన ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. గురువారం జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌కు న‌వీ ముంబై స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.