Rohit Sharma : టెస్టుల్లో చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ప్ర‌పంచంలోనే తొలి ఆట‌గాడిగా

టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో అద‌ర‌గొడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.

Rohit Sharma

Rohit Sharma Feat : టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma)అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌(West Indies)తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో అద‌ర‌గొడుతున్నాడు. తొలి టెస్టులో శ‌త‌కంతో చెల‌రేగ‌గా రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్థ‌శ‌త‌కాలు బాదేశాడు. ఈ క్ర‌మంలోనే ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో వ‌రుస‌గా అత్య‌ధిక సార్లు రెండు అంకెల స్కోర్లు సాధించిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Ishant Sharma : రిష‌బ్‌పంత్ ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌డు.. వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌కు డౌటే..! టీమ్ఇండియా పేసర్‌ కీల‌క వ్యాఖ్య‌లు

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు శ్రీలంక మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ మ‌హేలా జ‌య‌వ‌ర్థ‌నే పేరిట ఉండేది. జ‌య‌వ‌ర్థ‌నే వ‌రుస‌గా 29 ఇన్నింగ్స్‌ల్లో రెండు అంకెల స్కోర్లు చేశాడు. విండీస్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచ‌రీతో జయవర్ధనే రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. హిట్‌మ్యాన్‌ వ‌రుస‌గా 30 ఇన్నింగ్స్‌ల్లో డ‌బుల్ డిజిట్ స్కోరు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. గ‌త 30 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ సాధించిన ప‌రుగులు ఇలా.. 12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 15, 46, 120, 32, 12, 12, 35, 15, 43, 103, 80, 57. ఇందులో నాలుగు శ‌త‌కాలు, ఐదు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

Aiden Markram : ప్రియురాలిని పెళ్లాడిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్.. అత్త బాగుందంటూ..!

ఇక‌ మ్యాచ్‌ విషయానికి వస్తే రెండో టెస్టులో టీమ్ఇండియా విజ‌యానికి 8 వికెట్ల దూరంలో ఉంది. భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 438 ప‌రుగులు చేయ‌గా విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 255 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త్‌కు కీల‌క‌మైన 183 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో టీ20 త‌ర‌హా బ్యాటింగ్‌తో బ్యాట‌ర్లు చెల‌రేగ‌డంతో 24 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు న‌ష్టానికి 181 ప‌రుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

వెస్టిండీస్ ముందు 365 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయి 76 ప‌రుగులు చేసింది. క్రీజులో ట‌గ్ న‌రైన్ చంద్ర‌పాల్(24), బ్లాక్‌వుడ్‌(20)లు ఉన్నారు. వెస్టిండీస్ విజ‌యానికి 289 ప‌రుగులు అవ‌స‌రం కాగా భార‌త గెల‌వాలంటే 8 వికెట్లు కావాలి. ఆఖ‌రి రోజు వ‌రుణుడు ఆటంకం క‌లిగించ‌కుంటా ఉంటే మ్యాచ్ ఫ‌లితం తేల‌డం ఖాయం.

ట్రెండింగ్ వార్తలు