IND vs AUS : స‌ర్ఫ‌రాజ్ ఖాన్ విఫ‌లం.. తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసిన రోహిత్ శ‌ర్మ‌.. రెండో టెస్టుకు డౌటేనా!

టీమ్ఇండియా యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడు.

Rohit Sharma frustration peaks as Sarfaraz Khan fails in IND vs PM XI clash

IND vs AUS : టీమ్ఇండియా యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడు. కాన్‌బెర్రాలోని మ‌నుకా ఓవ‌ల్‌లో ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో జ‌రిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి దారుణంగా విఫ‌లం అయ్యాడు. దీన్ని చూసిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో తీవ్ర నిరాశ‌ను వ్య‌క్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ఉంది.

రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో తొలి రోజు వ‌ర్షం కార‌ణంగా రద్దు అయింది. ఇక రెండో రోజు ఇరు జ‌ట్లు కేవ‌లం 46 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పీఎం ఎలెవ‌న్ 43.2 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Champions Trophy 2025: ‘వాళ్లను సొంతగడ్డపైనే ఓడించాలి’.. పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై షోయబ్ అక్తర్ సీరియస్

ల‌క్ష్య ఛేద‌న‌లో టీమ్ఇండియా అద‌ర‌గొట్టింది. 42.5 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రాక్టీస్ మ్యాచ్ కావ‌డంతో మొత్తం 46 ఓవ‌ర్లు ఆడింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ (45), శుభ్‌మ‌న్ గిల్ (50) లు రాణించారు. అయితే.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ మాత్రం నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

స్పిన్న‌ర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ ప్లిక్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీప‌ర్ చేతుల్లో ప‌డింది. దీన్ని చూసిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న త‌ల‌దించుకుని నిరాశ‌ను వ్య‌క్తం చేశాడు.

Guinea: గినియాలో ఘోర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘర్షణ.. 100 మందికిపైగా మృతి

కాగా.. ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు తుది జ‌ట్టులో ఛాన్స్ ద‌క్క‌లేదు. ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫ‌లం కావ‌డంతో రెండో టెస్టులో అత‌డిని ఆడించ‌డం అనుమానంగానే మారింది.