Rohit Sharma Funny Reaction During 1st ODI vs Sri Lanka
Rohit Sharma Funny Reaction : కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డే టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక (56), దునిత్ వెల్లలాగే (67నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, దూబె, కుల్దీప్ యాదవ్, వాష్టింగ్టన్ సుందర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం రోహిత్ శర్మ(47 బంతుల్లో 58) హాఫ్ సెంచరీ బాదగా, కేఎల్ రాహుల్ (31), అక్షర్ పటేల్ (33), శివమ్ దూబె (25) లు రాణించడంతో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఈ టోర్నీకి సూపర్ ఓవర్ నిబంధన లేకపోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ, చరిత్ అసలంక చెరో మూడు వికెట్లు తీశారు. దునిల్ వెల్లలాగే రెండు వికెట్లు పడగొట్టాడు. అసిత ఫెర్నాండో, అఖిల దనంజయ లు చెరో వికెట్ పడగొట్టారు.
IND vs SL : భారత్ – శ్రీలంక తొలివన్డే టై.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
సుందర్ రోహిత్ ఫైర్..
ఇక ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా ఇది జరిగింది. ఇన్నింగ్స్ 29వ ఓవర్‌ను వాషింగ్టన్ సుందర్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతిని లంక బ్యాటర్ దునిత్ వెల్లలగే షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. బంతి అతడి ప్యాడ్లను తాకింది. ఎల్బీడబ్ల్యూ కోసం బౌలర్ సుందర్‌తో పాటు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశాడు. అయితే.. అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వలేదు.
దీంతో సుందర్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూశాడు. దీంతో రివ్యూకి వెళ్లాలా అంటూ రోహిత్ అతడిని అతడిని అడిగాడు. అయితే.. సుందర్ కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోయాడు. నీకేమనిపిస్తుందని అన్నట్లుగా రోహిత్ వైపు చూశాడు. ఇంకో వైపు రివ్య్వూ తీసుకునేందుకు సమయం ముగిసి పోతుండడంతో సుందర్ పై రోహిత్ సీరియస్ అయ్యాడు.
ఏంటీ..? ఆ విషయాన్ని నువ్వే చెప్పాలి గదా. నా వైపు ఎందుకు చూస్తున్నావు. అయినా నాకేం కనిపిస్తుందని అడుగుతున్నావు..? నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేయాలా..? అని అన్నాడు. ఆ వెంటనే నవ్వేశాడు. రోహిత్ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Vintage stump mic banter from @ImRo45 ?
Watch the action from #SLvIND LIVE now on Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4 & Sony Sports Ten 5 ? ?#SonySportsNetwork #SLvIND #TeamIndia #RohitSharma pic.twitter.com/HYEM5LxVus
— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2024