IND vs SL : భారత్ – శ్రీలంక తొలివన్డే టై.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. శ్రీలంక తమ ముందు ఉంచిన స్కోర్ విలువైనదే. ఆ స్కోర్ అందుకోవడానికి మంచిగా బ్యాటింగ్ చేయాలి.

IND vs SL : భారత్ – శ్రీలంక తొలివన్డే టై.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

Rohit Sharma and Arshdeep Singh

Rohit Sharma : భారత్ – శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ శుక్రవారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్ టైగా ముగిసింది. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం ఖాయమని చివరి వరకు క్రీడాభిమానులు అధికశాతం మంది బావించారు. కానీ, శ్రీలంక బౌలర్ల అద్భుత బౌలింగ్ ముందు టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 14 బంతులకు ఒక్క పరుగు చేయడంలో టీమిండియా విఫలం అయింది. ఒక్క పరుగు చేయాల్సిన సమయంలో చివరి బ్యాటర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ క్రీజులోకి వచ్చాడు. సింగిల్ తీసేందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఎల్బీ డబ్ల్యూ గా ఔట్ అయ్యాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశగా కనిపించాడు.

Also Read : IND vs SL 1st ODI : డ్రాగా ముగిసిన తొలి వన్డే..

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. శ్రీలంక తమ ముందు ఉంచిన స్కోర్ విలువైనదే. ఆ స్కోర్ అందుకోవడానికి మంచిగా బ్యాటింగ్ చేయాలి. మ్యాచ్ లో ఓపెనింగ్ భాగస్వామ్యం మెరుగ్గానే ఉంది. కానీ, 10 ఓవర్ల తరువాత శ్రీలంక బౌలర్ల స్పిన్ ఎటాక్ తో ఇబ్బంది మొదలైంది. మేము ఇది ముందే ఊహించాం. ఈ పిచ్ పై షాట్లు ఆడే పరిస్థితి తక్కువ. మేము క్రీజులో నిలదొక్కుకొని సింగిల్స్ చేస్తూ వీలున్నప్పుడు షాట్లు ఆడేందుకు ప్రయత్నించాం. కానీ, దురదృష్టవ శాత్తూ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చాం. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ భాగస్వామ్యంతో మళ్లీ మేము గెలుస్తామనే ధీమా వచ్చింది. చివరి వరకు అదే ఆలోచన ఉన్నా.. చివరల్లో ఊహించని పరిణామం ఎదురైంది. బ్యాటర్లు క్రీజులో ఉండి నిలకడగా ఆడలేక పోయారని రోహిత్ శర్మ అన్నారు.

Also Read : IND vs SL : తొలి వ‌న్డేలో మీరు ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా..? చేతికి నల్ల రంగు బ్యాండ్ల‌తో భార‌త ఆట‌గాళ్లు..

శ్రీలంక-భారత్ తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు .. రోహిత్ 58, శుభ్‌మన్ 16, కోహ్లీ 24, వాషింగ్టన్ సుందర్ 5, శ్రేయాస్ 23, కేఎల్ రాహుల్ 31, అక్షర్ పటేల్ 33, శివం దూబె 25, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. అర్ష్ దీప్ సింగ్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ 47.5 ఓవర్లకు 230 పరుగులకు ఆలౌట్ అయింది.