Rohit Sharma : ఏంట‌య్యా రోహిత్.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఫామ్ కోల్పోయావు.. ఇలాగైతే క‌ష్ట‌మే!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు మ‌రెంతో స‌మ‌యం లేదు. అయితే.. టీమ్ఇండియా అభిమానులను ఓ విష‌యం క‌ల‌వ‌ర‌పెడుతోంది.

Rohit Sharma – T20 World cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు మ‌రెంతో స‌మ‌యం లేదు. అయితే.. టీమ్ఇండియా అభిమానులను ఓ విష‌యం క‌ల‌వ‌ర‌పెడుతోంది. టీమ్ఇండియా కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ పేల‌వ ఫామ్ ఇందుకు కార‌ణం. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రోహిత్ శ‌ర్మ దారుణంగా విఫ‌లం అవుతున్నాడు.

ఐపీఎల్ 17వ సీజ‌న్ ఫ‌స్టాప్‌లో దుమ్ములేపిన రోహిత్ సెకాండ్‌లో త‌డ‌బ‌డుతున్నాడు. సోమ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ ఓ బౌండ‌రీ బాది పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో ఓ చెత్త షాట్ ఆడి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. రోహిత్ ఫామ్ పై ప్ర‌ముఖ కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంద‌న్నాడు.

Suryakumar Yadav : రోహిత్ శ‌ర్మ‌ రికార్డును స‌మం చేసిన సూర్య‌కుమార్‌.. ఆనందంలో అభిమానులు

ఐపీఎల్‌లో తొలి 7 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 297 ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాత 5 ఇన్నింగ్స్‌ల్లో 34 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ విష‌యాన్నే హ‌ర్షా భోగ్లే ప్ర‌స్తావించాడు. మంచి ముగింపును అందుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని హ‌ర్షా భోగ్లే ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

కాగా.. రోహిత్ శ‌ర్మ ఫామ్ పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మొద‌లైంది. కెప్టెన్ కాకుంటే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు రోహిత్ ను ఎంపిక చేసేవారు కాద‌ని అంటున్నారు. చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌కు ఫోన్ చేసి కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు చెప్పాల‌ని కామెంట్లు చేస్తున్నారు.

RCB : ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జ‌ర‌గాల్సిందే

ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 173 ప‌రుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 48), పాట్ క‌మిన్స్ (17 బంతుల్లో 35నాటౌట్‌) లు రాణించారు. ల‌క్ష్యాన్ని ముంబై 17.2 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. సూర్య‌కుమార్ యాద‌వ్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాది 102 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ తో ముంబై విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ట్రెండింగ్ వార్తలు