Rohit Sharma : మీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్.. రోహిత్ శర్మకు టీ20 ప్రపంచకప్ అందజేస్తున్న గణపతి..
గణపతి విగ్రహాలను తీసుకువెలుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 7, 2024 / 07:53 AM IST
Rohit Sharma Holds T20 World Cup Trophy With Ganpati Bappa
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఏ వాడలో చూసిన గణపతి విగ్రహాలతో సందడి వాతావరణం నెలకొంది. గణపతి విగ్రహాలను తీసుకువెలుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇందులో ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.
జూన్‌లో వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ 2024కి ఆతిథ్యం ఇవ్వగా విజేతగా భారత్ నిలిచింది. పొట్టి ఫార్మాట్‌లో విజేతగా నిలిచి స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు ముంబైలో ఘన స్వాగతం లభించింది.
Paralympics : భారత్ ఖాతాలో మరో స్వర్ణం..
ముంబైలోని మెరైన్‌డ్రైవ్‌లో భారత జట్టు ఓపెన్ బస్సులో నిలబడి అభిమానులకు అభివాదం చేసిన సంగతి తెలిసిందే. అచ్చం అలాగే అలంకరించిన వాహనం పై గణేశ్ విగ్రహంతో పాటు టీ20 ప్రపంచకప్‌ను పట్టుకున్న రోహిత్ శర్మ ఫ్లకార్లును అమర్చారు.
దీన్ని చూస్తుంటే.. గణపయ్య రోహిత్ శర్మకు టీ20 ప్రపంచకప్ అందిస్తున్నట్లు ఉంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఇక రోహిత్ నాయకత్వంలో డబ్ల్యూటీసీ ట్రోఫీతో పాటు 2027 వన్డే ప్రపంచకప్‌ను భారత్ అందుకునేలా చూడాలని వినాయకుడిని అభిమానులు కోరుకుంటున్నారు.
Virat Kohli : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..
