Virat Kohli : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది.

Virat Kohli can break 3 records in IND vs BAN Test series
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మూడు రికార్డుల పై కన్నేశాడు. టెస్టుల్లో మంచి ఫామ్‌లోనే ఉన్న కోహ్లీ తన ఫామ్‌ను కంటిన్యూ చేసే ఆ మూడు రికార్డులను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
152 పరుగులు చేస్తే..
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 113 టెస్టులు ఆడాడు. 49.1 సగటుతో 8848 పరుగులు చేశౄడు. ఇందులో 29 శతకాలు, 30 అర్థశతకాలు ఉన్నాయి. రెండు టెస్టు మ్యాచుల్లో గనుక కోహ్లీ మరో 52 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు గ్రాహం గూచ్ (8900) ని అధిగమిస్తాడు. 152 పరుగులు చేస్తే సుదీర్ఘ ఫార్మాట్‌లో 9వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
30 సెంచరీలు..
సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 29 సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచుల్లో కనీసం ఒక్క సెంచరీ చేసినా అతడి టెస్టు శతకాల సంఖ్య 30కి చేరుకుంటాయి. దీంతో అతడు డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలు కొడతాడు. బ్రాడ్‌మన్ టెస్టుల్లో 29 శతకాలు చేశాడు.
బంగ్లాదేశ్ పై అత్యధిక పరుగులు
కోహ్లీ 32 పరుగులు చేస్తే.. బంగ్లాదేశ్ పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. కోహ్లీ ఇప్పటి వరకు బంగ్లాదేశ్ పై టెస్టుల్లో 437 పరుగులు చేశాడు. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న పుజారా 468 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 820 పరుగులు చేశాడు. రెండో స్థానంలో 560 పరుగులతో రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు.