Dinesh Karthik : రూట్ వర్సెస్ కోహ్లీ డిబేట్.. దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు.. గణాంకాలను చూస్తే..
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ ఎవరు అనేదానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది.
Virat vs Root : ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ ఎవరు అనేదానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ వరుస శతకాలు సాధించాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 34 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ ఆడుతున్న వారిలో ప్రస్తుతం అతడే అత్యుత్తమం అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో రూట్ బెస్ట్ ప్లేయర్. త్వరలోనే అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడని వాన్ అన్నాడు. అంతేకాదండోయ్.. టెస్టుల్లో సచిన్ పేరిట ఉన్న 51 శతకాల రికార్డును సైతం రూట్ బద్దలు కొడతాడని చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో రూట్ వర్సెస్ కోహ్లీ డిబేట్ నడుస్తోంది.
Rohit Sharma : బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు.. జిమ్‌లో రోహిత్ శర్మ.. ఫోటోలు వైరల్..
దీనిపై ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీమ్ఇండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ కు ప్రశ్న ఎదురైంది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీనే అత్యుత్తమం అని కార్తీక్ అన్నాడు. గణాంకాల ప్రకారం చూసుకుంటే చాలా మంది రూటు వైపు మొగ్గుచూపుతారు. అయితే.. కోహ్లీని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను రూట్‌ను ఎంచుకోను. నా దృష్టిలో విరాట్ కోహ్లీ అత్యుత్తమం అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల కాలంలో రూట్ టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడని, కోహ్లీ మాత్రం ఎన్నో ఏళ్లుగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నాడని తెలిపాడు.
IPL 2025 : గౌతమ్ గంభీర్ ఔట్.. అతడి స్థానంలో శ్రీలంక దిగ్గజం ?
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 113 టెస్టులు ఆడాడు. 49.1 సగటుతో 8848 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక రూట్ విషయానికి వస్తే.. 145 టెస్టులు ఆడాడు 50.9 సగటుతో 12377 పరుగులు చేశాడు. ఇందులో 34 శతకాలు, 64 అర్థశతకాలు ఉన్నాయి.