IPL 2025 : గౌతమ్ గంభీర్ ఔట్.. అతడి స్థానంలో శ్రీలంక దిగ్గజం ?
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర కొత్త ప్రాంఛైజీలో చేరబోతున్నట్లు సమాచారం.

Kumar Sangakkara To Replace Gautam Gambhir As KKRs Mentor Reports
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర కొత్త ప్రాంఛైజీలో చేరబోతున్నట్లు సమాచారం. అతడు ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. ఆర్ఆర్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకం దాదాపుగా ఖరారు కావడంతో సంగక్కర ఆ ప్రాంఛైజీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా స్పోర్ట్స్ టుడే వెల్లడించింది.
ఇక సంగక్కరకు ఇతర ప్రాంఛైజీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని, ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా వెళ్లేందుకు సంగక్కర ఆసక్తి చూపిస్తున్నాడని పేర్కొంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయని, త్వరలోనే దీనిపై అతడు ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నాడని తెలిపింది.
Cristiano Ronaldo : ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు.. మొదటి ప్లేయర్ అతనే
ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్‌కు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా పని చేశాడు. అయితే.. అతడు టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో గంభీర్ స్థానంలో సంగక్కరను తీసుకోవాలని కేకేఆర్ భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
స్ట్రోక్‌ప్లే, మైండ్ గేమ్‌కు సంగక్కర పెట్టింది పేరు. అతడి మార్గనిర్దేశ్యంలో రాజస్థాన్ ఐపీఎల్ 2022లో పైనల్‌కు చేరుకుంది. ఒకవేళ సంగక్కర జట్టును వీడితే అది ఆర్ఆర్‌కు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
Shreyas Iyer : ఇలాంటి ఇన్నింగ్స్‌లతో జట్టులో చోటు కావాలంటే ఎలా ? కనీసం 10 పరుగులైనా చేయవయ్యా..