Cristiano Ronaldo : ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు.. మొదటి ప్లేయర్ అతనే
క్రిస్టియానో రొనాల్డో కొద్దిరోజుల్లో అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీలకు రిటైర్ అవుతాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తపై ఆయన స్పందించాడు..
Cristiano Ronaldo 900 Goals : ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తన కెరీర్ లో 900 గోల్స్ చేసిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడిగా నిలిచాడు. UEFA నేషన్స్ లీగ్‌లో క్రొయేషియాపై రొనాల్డో ఈ ఫీట్ నమోదు చేశాడు. లియోనెల్ మెస్సీ కంటే 58 గోల్స్ ఆధిక్యంలో రొనాల్డో ఉన్నాడు. మెస్సీ 842 గోల్స్ చేశాడు. బ్రెజిలియన్ లెజెండ్ పీలే 765 గోల్స్ తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ .. నేను చాలా కాలంగా చేరుకోవాలనుకున్న మైలురాయి ఇది. 900 గోల్స్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను ఈ సంఖ్యకు చేరుకుంటానని ముందే ఊహించాను. ఎందుకంటే నేను ఆడటం కొనసాగించినప్పుడు ఇది సహజంగానే జరుగుతుందని అన్నాడు. ఇది ఒక మైలురాయి కాబట్టి భావోద్వేగంగా ఉందని రొనాల్డో పేర్కొన్నాడు. అనంతరం ఎక్స్ వేదికగా రొనాల్డో పోస్టు చేశారు. నేను దీని గురించి కలలు కన్నాను, నాకు మరిన్ని కలలు ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు! అంటూ తెలిపారు.
క్రిస్టియానో రొనాల్డో కొద్దిరోజుల్లో అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీలకు రిటైర్ అవుతాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తపై ఆయన స్పందించాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ ప్లాన్లు ఏమీ లేదని చెప్పాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నా లక్ష్యం వెయ్యి గోల్స్. నేను త్వరలోనే 900 గోల్స్ స్కోరర్ అవుతాను. కానీ, నా లక్ష్యం వెయ్యి గోల్స్. ఆ లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం నాకుందని రొనాల్డో చెప్పుడు.
I dreamed of this, and I have more dreams. Thank you all! pic.twitter.com/2SS3ZoG2Gl
— Cristiano Ronaldo (@Cristiano) September 5, 2024