Shreyas Iyer : ఇలాంటి ఇన్నింగ్స్‌లతో జట్టులో చోటు కావాలంటే ఎలా ? కనీసం 10 పరుగులైనా చేయవయ్యా..
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు.
Shreyas Iyer : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. బుచ్చిబాబు టోర్నీలో దారుణంగా నిరాశపరిచిన అతడు దులీప్ ట్రోఫీలోనూ అదే రకమైన ఆటతీరును కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో ఇండియా-డి జట్టుకు నాయకత్వం వహిస్తున్న అయ్యర్ 16 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురం వేదికగా ఇండియా-సి, ఇండియా-డి జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఇండియా-డికు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తుండగా, ఇండియా-సి కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. టాస్ గెలిచిన రుతురాజ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇండియా-డి తొలుత బ్యాటింగ్ కు దిగింది. అన్షుల్ కాంబోజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోని ఐదో బంతికి ఓపెనర్ అథర్వ తైదే (4) ఔట్ అయ్యాడు.
Paralympics 2024 : పారాలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర.. భారత్ @ 24
దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో క్రీజులో కుదురుకోని భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి పోయి వికెట్ కీపర్‌కు అభిషేక్ పొరెల్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక్కడి నుంచి మొదలైన వికెట్ల పతనం వేగంగా కొనసాగింది. 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో అక్షర్ పటేల్ (20 నాటౌట్), శరన్ష్ జైన్ (13) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే.. ఏడో వికెట్‌కు 28 పరుగులు జోడించిన తరువాత శరన్ష్ జైన్ రనౌట్ అయ్యాడు. దీంతో తొలి రోజు లంచ్ విరామానికి ఇండియా-డి 7 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. అక్షర్‌పటేల్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్‌లు క్రీజులో ఉన్నారు.
ఇలాగైతే..
సెప్టెంబర్ 19 నుంచి టీమ్ఇండియా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. దులీప్ ట్రోఫీలో రాణించిన ఆటగాళ్లనే బంగ్లాతో సిరీస్‌కు ఎంపిక చేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫామ్ కోల్పోయి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలోనే జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఈ సమయంలో అద్భుతంగా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడాల్సి పోయి విఫలం అవుతూ జట్టులో తన స్థానాన్నే ప్రశ్నార్థం చేసుకుంటున్నాడు. ఇలాగే ఆడితే.. శ్రేయస్ అయ్యర్‌ను భారత టెస్టు జట్టులో చూడడం సాధ్యం అయ్యే పని కాదు.
#ShreyasIyer departs after scoring 9 off 16 balls. pic.twitter.com/IwfRGZaUAV
— starking (@starkingsports) September 5, 2024