Paralympics : భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం..

పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.

Paralympics : భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం..

Praveen Kumar wins Indias record breaking sixth gold at Paris Paralympics

Paralympics : పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. భార‌త్ ఖాతాలో మ‌రో ప‌త‌కం వ‌చ్చి చేరింది. పురుషుల హైజంప్‌లో అథ్లెట్ ప్ర‌వీణ్‌కుమార్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. దీంతో భార‌త ప‌త‌కాల సంఖ్య 26కి చేరింది. ఇందులో 6 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 11 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి.

పురుషుల టీ64 హైజంప్‌ లో పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ 2.08 మీటర్ల ఎత్తుకు జంప్ చేసి గోల్డ్ గెలుచుకున్నాడు. కాగా.. ఇత‌డు టోక్యో పారాలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో పారాలింపిక్స్‌లో 21 ఏళ్ల వ‌య‌సులోనే రెండు ప‌త‌ల‌కాలు గెలుచుకున్న అథ్లెట్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

Shubman Gill : సైనీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌.. బిత్త‌ర‌పోయిన గిల్‌.. వీడియో వైర‌ల్‌

పారాలింపిక్స్ హైజంప్‌లో భార‌త త‌రుపున స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. అంత‌క‌ముందు మ‌రియ‌ప్ప‌న్ తంగ‌వేలు ఈ ఘ‌న‌త సాధించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ప్ర‌వీణ్‌కుమార్‌కి పుట్టుక‌తోనే కాలి వైక‌ల్యం ఉంది. ఓ కాలు చిన్న‌గా ఉండ‌డంతో చిన్న‌త‌నంలో ఆత్మ‌నూన్య‌త బావంతో ఉండేవాడు. దీన్ని పోగొట్టుకునేందుకు క్రీడ‌ల వైపు దృష్టి సారించాడు.

Virat Kohli : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..

మొద‌ట్లో వాలీబాల్ ఎక్కువ‌గా ఆడేవాడు. అయితే.. అత‌డిలోని సామ‌ర్థ్యాన్ని గుర్తించిన పారా అథ్లెటిక్స్ కోచ్ స‌త్య‌పాల్ అత‌డిని హైజంప్ వైపున‌కు ప్రోత్స‌హించాడు. దీంతో అత‌డి కెరీర్ మ‌లుపు తిరిగింది.