Rohit Sharma : శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్ ఓట‌మి.. రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. ప్ర‌పంచం మునిగిపోదు..

సిరీస్ ఓట‌మిపై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మీడియాతో మాట్లాడాడు.

Rohit Sharma

Rohit Sharma – IND vs SL : శ్రీలంక‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయ‌డంతో వ‌న్డే సిరీస్‌ను సైతం అల‌వోక‌గా భార‌త్ గెలుస్తుంద‌ని అంతా భావించారు. అయితే.. వ‌న్డే సిరీస్ ప్రారంభం అయ్యాక గానీ అస‌లు సంగ‌తి అర్థం కాలేదు. తొలి వ‌న్డేలో ఈజీగా గెల‌వాల్సి ఉండ‌గా వికెట్లు చేజార్చుకుని ఆఖ‌రికి మ్యాచ్‌ను టైగా ముగించింది. రెండో వ‌న్డేలో ఓడిపోయింది. ఇక మూడో వ‌న్డేలో అయితే.. క‌నీసం పోరాడ‌కుండానే భార‌త జ‌ట్టు చేతులెత్తేసింది. ఫ‌లితంగా శ్రీలంక 2-0 తేడాతో వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. 27 ఏళ్ల త‌రువాత భార‌త జ‌ట్టు పై లంక వ‌న్డే సిరీస్‌ను గెల‌వ‌డం గ‌మ‌నార్హం.

సిరీస్ ఓట‌మిపై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మీడియాతో మాట్లాడాడు. త‌మ‌కంటే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతోనే శ్రీలంక గెలిచింద‌న్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంతో ఆట‌గాళ్లు రిలాక్స్ అయ్యార‌నే వాద‌న స‌రికాద‌న్నాడు. ఇలా చెప్ప‌డం పెద్ద జోక్ అని అన్నాడు. తాను కెప్టెన్‌గా ఉన్నంత‌కాలం విజ‌య‌దాహం తీర‌ద‌న్నాడు. పిచ్ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోవ‌డంలో తాము విఫ‌లం అయ్యామ‌ని చెప్పుకొచ్చాడు.

Saina Nehwal : వినేశ్ ఫోగ‌ట్ అన‌ర్హ‌త పై సైనా నెహ్వాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఆ ఇద్దరే చెప్పాలి..

ఇక స్పిన్ ఆడ‌డంలో బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ‌టం పై స్పందిస్తూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నాడు. అయితే.. వైఫ‌ల్యాల‌ను మాత్రం ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. ఇక మిడిల్ ఓవ‌ర్ల‌లో ఎలా రాణించాల‌నేది తెలుసుకునేందుకు ఈ సిరీస్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నాడు. సిరీస్ పోయినంత మాత్ర‌న ప్ర‌పంచం ఏమీ మునిగిపోద‌న్నాడు. ఇక ఆట‌గాళ్లంతా చాలా కాలంగా నిల‌క‌డైన ఆట‌తీరును కొన‌సాగిస్తున్నార‌ని, ఆందోళ‌న అవ‌స‌రం లేద‌న్నాడు.

మూడో వ‌న్డే విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 248 ప‌రుగులు చేసింది. లంక బ్యాట‌ర్ల‌లో అవిష్క ఫెర్నాండో(96) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. కుశాల్ మెండిస్ (59) హాఫ్ సెంచ‌రీ బాదాడు. భార‌త బౌల‌ర్ల‌లో రియాన్ ప‌రాగ్ మూడు వికెట్లు తీశాడు. సిరాజ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, కుల్దీప్ యాద‌వ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు షాక్.. వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు

అనంత‌రం భార‌త్ 26.1 ఓవ‌ర్ల‌లో 138 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఫ‌లితంగా లంక 110 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యాన్ని అందుకుంది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ‌(35), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (30) లు ఫ‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన ఆట‌గాళ్లు దారుణంగా విఫ‌లం అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు