IND vs ENG Match: ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం

ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అతర్జాతీయ క్రికెట్ లో 18వేల పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే రోహిత్ మరో 47 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Rohit Sharma

Rohit Sharma : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మెగాటోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన టీమిండియా ఐదు మ్యాచ్ లలోనూ విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి లక్నోలో వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే టీమిండియాకు సెమీఫైనల్ బెర్తు ఖాయమవుతుంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం లేదని ప్రచారం జరుగుతుంది.

Also Read : IND vs ENG Match : ఇంగ్లాండ్ తో మ్యాచ్.. 20ఏళ్లుగా టీమిండియాకు దక్కని విజయం.. అశ్విన్ రీఎంట్రీ ఉంటుందా? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే ..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైనట్లు సమాచారం. శనివారం ప్రాక్టీస్ సెషన్ లో బౌలర్ విసిరిన బౌన్సర్ తగిలి రోహిత్ మణికట్టుకు గాయమైనట్లు తెలిసింది. దీంతో తీవ్రనొప్పి కారణంగా రోహిత్ శర్మ ఫిజియోల సాయంతో ప్రాక్టీస్ ను అర్ధాంతరంగా ఆపేసి వెళ్లిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, రోహిత్ శర్మకు గాయం విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు దూరమైతే కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్ చేపడతారు.

BAN vs NED Match : నెదర్లాండ్స్ పై బంగ్లాదేశ్ ఓటమి.. బూటుతో కొట్టుకున్న అభిమాని.. ఆ తరువాత ఏమన్నాడంటే? వీడియో వైరల్

ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అతర్జాతీయ క్రికెట్ లో 18వేల పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే రోహిత్ మరో 47 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ తో మ్యాచ్లో హిట్ మ్యాన్ ఈ రికార్డును అధిగమిస్తాడని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే మెగాటోర్నీలో మ్యాచ్ ల నుంచి టీమిండియా ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా దూరమయ్యాడు. గాయం కారణంగా అతను చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా కీలకమైన ఇంగ్లాండ్ మ్యాచ్ కు దూరమైతే టీమిండియాకు ఇబ్బందికర విషయమనే చెప్పొచ్చు.