BAN vs IND 2nd ODI: టీమిండియాకు బిగ్ షాక్.. ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ..

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం రెండో వన్డే జరుగుతుంది. మ్యాచ్ సందర్భంగా మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో స్లిప్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో రోహిత్ బొటన వేలుకు గాయమైంది. అయితే, స్కానింగ్ తీయించేదుకు బీసీసీఐ బృందం రోహిత్ ను ఆస్పత్రికి తరలించారు.

BAN vs IND 2nd ODI: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగింది. అయితే రెండో వన్డేలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. బొటన వేళ్లకు దెబ్బతగలడంతో రోహిత్ మైదానం వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతన్ని స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

India vs Bangladesh Match: పుంజుకుంటారా? టీమిండియాకు పరీక్ష.. నేడు బంగ్లాదేశ్‌తో రెండో వన్డే ..

మ్యాచ్ రెండో ఓవర్లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ప్రారంభించాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని బంగ్లా బ్యాటర్ అనాముల్ హక్ స్లిప్‌లోకి తరలించాడు. అక్కడే ఉన్న రోహిత్ శర్మ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బొటన వేలికి గాయమైంది. ఈ క్రమంలో క్యాచ్ సైతం మిస్ అయింది. గాయం తీవ్ర ఎక్కువగా ఉండటంతో రోహిత్ శర్మ మైదానాన్ని వీడాడు. రోహిత్ స్థానంలో రజిత్‌ పటిదార్‌ సబ్‌స్ట్యూట్‌ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. అయితే గాయపడిన రోహిత్‌ను వెంటనే స్కానింగ్‌కు తరిలించినట్లు బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

ఇదిలాఉంటే రోహిత్ శర్మ క్యాచ్ వదిలిన తరువాత సిరాజ్ వేసిన బాల్‌కు అనముల్ హుక్ (11) ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. తప్పక గెలవాల్సిన రెండో వన్డేలో భారత్ బౌలర్లు విజృంభిస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో బంగ్లాదేశ్ జట్టు 28 ఓవర్లకు 108 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది.

ట్రెండింగ్ వార్తలు