Rohit Sharma : బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు.. జిమ్‌లో రోహిత్ శర్మ.. ఫోటోలు వైరల్..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టాడు.
- Thota Vamshi Kumar
- Published on- September 6, 2024 / 11:21 AM IST
Rohit Sharma intensifies fitness regime ahead of Bangladesh Test series
Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఈ విషయంలో హిట్‌మ్యాన్ తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురి అవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆయన తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు. దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీకి దూరంగా ఉన్న రోహిత్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో కొత్తగా పునర్నిర్మించిన జిమ్‌లో శ్రమిస్తున్నాడు.
ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ‘ఆధునీకరించిన మా జిమ్‌ను ఉపయోగించి కసరత్తులు చేస్తున్న తొలి వ్యక్తి రోహిత్ శర్మ.’ అని తెలిపింది. అతడి మార్గదర్శకత్వంలో ఫిట్‌నెస్ సరికొత్తశకం ప్రారంభం అవుతుందని రాసుకొచ్చింది. ఈ మేరకు రోహిత్ జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలను పంచుకుంది.
IPL 2025 : గౌతమ్ గంభీర్ ఔట్.. అతడి స్థానంలో శ్రీలంక దిగ్గజం ?
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది భారత్. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే ప్రతి టెస్టులో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు.
ఇటీవల ముగిసిన శ్రీలంకతో వన్డే సిరీస్‌లో రోహిత్ రాణించాడు. మూడు వన్డేల్లో వరుసగా 58,64, 35 పరుగులు చేశాడు. అతడు మినహా మిగిలిన ఆటగాళ్లు రాణించకపోవడంతో లంక వన్డే సిరీస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Cristiano Ronaldo : ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు.. మొదటి ప్లేయర్ అతనే
