Rohit Sharma : తొలి వ‌న్డేకు ముందు రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. పంత్, కేఎల్ రాహుల్‌ల‌లో వికెట్ కీప‌ర్‌గా ఎవ‌రంటే..?

తొలి వ‌న్డేకు ముందు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మీడియాతో మాట్లాడాడు.

Rohit Sharma – KL Rahul : శ్రీలంక‌తో మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌కు భార‌త్ సిద్ద‌మవుతోంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు రావ‌డంతో భార‌త్ బ‌లం మ‌రింతగా పెరిగింది. రోహిత్ నాయ‌క‌త్వంలో టీమ్ఇండియా ఆడ‌నుంది. భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య శుక్ర‌వారం తొలి వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో తొలి వ‌న్డేకు ముందు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మీడియాతో మాట్లాడాడు. తుది జ‌ట్టు ఎంపిక‌, హెడ్ కోచ్ గంభీర్ గురించి హిట్‌మ్యాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

కేఎల్ రాహుల్‌, రిష‌బ్ పంత్‌ల‌లో వికెట్ కీప‌ర్‌గా ఎవ‌రిని ఎంచుకుంటారు అన్న ప్ర‌శ్న రోహిత్‌కు ఎదురైంది. ఈ ఇద్ద‌రిలో ఒక‌రిని ఎంచుకోవ‌డం చాలా క‌ష్టమైన విష‌యం అని చెప్పాడు. ఎందుకంటే ఇద్ద‌రూ మ్యాచ్ విన్న‌ర్లేన‌ని తెలిపాడు. ఇద్ద‌రు స‌మ‌ర్ధులే, ఆట‌లో ఎవ‌రికి వారే సాటి అని తెలిపాడు. వీరిద్ద‌రు గ‌తంలో ఒంటిచేత్తో ఎన్నో మ్యాచుల్లో జ‌ట్టును గెలిపించార‌ని, వీరిద్ద‌రిలో ఒక‌రిని ఎంచుకోవాలంటే ఎన్నో కోణాల్లో ఆలోచించాల్సి ఉంటుంద‌న్నాడు.

MS Dhoni : రిటైర్‌మెంట్ పై ధోని కీల‌క వ్యాఖ్య‌లు.. బంతి నా కోర్టులో లేదు.. జ‌ట్టుకు మేలు చేసేలా నిర్ణ‌యం..

అయితే.. ఇది సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మేన‌ని చెప్పాడు. ఓ కెప్టెన్‌గా ఎక్కువ ఆప్ష‌న్లు ఉండ‌డం మంచి విష‌యం అని అన్నాడు. ఈ విష‌యం గురించి హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌తో చ‌ర్చిస్తాన‌ని తెలిపాడు. జ‌ట్టులో ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్లు ఉన్న‌ప్పుడే ఆశించిన ఫ‌లితాలు ద‌క్కుతాయ‌ని చెప్పాడు.

ఇక హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ గురించి మాట్లాడుతూ.. అత‌డు చాలా క్రికెట్ ఆడాడ‌ని చెప్పాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీల‌కు కూడా ప‌ని చేశాడు. అత‌డితో క‌లిసి క్రికెట్ ఆడాం. కొత్త కోచింగ్ కోచింగ్ బృందంతో డ్రెస్సింగ్ రూమ్‌లో విభిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది అని రోహిత్ అన్నాడు. గంభీర్ న‌వ్వు పై ప్ర‌శ్న ఎదురు కాగా.. త‌న‌దైన శైలిలో రోహిత్ స‌మాధానం ఇచ్చాడు. న‌వ్వ‌డం, న‌వ్వ‌క‌పోవ‌డం గంభీర్ వ్య‌క్తిగ‌తం అని చెప్పాడు.

Viral Video : అంపైర్‌పై బ్యాట‌ర్‌ ప‌గ‌..! లాస్ట్ మ్యాచ్‌లో ఔట్ ఇచ్చాడా ఏందీ..?

ట్రెండింగ్ వార్తలు