Rohit Sharma: గౌతం గంభీర్‌కు రోహిత్ శర్మ పర్సనల్ రిక్వెస్ట్.. అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్న బీసీసీఐ..!

మ్యాచ్ రోజున ఉత్తమ ఫీల్డర్‌కు పతకాలు ఇవ్వడం, ఆ పతకాలను అందించడానికి దిగ్గజ వ్యక్తులను తీసుకురావడం వంటివి..

Rohit Sharma: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కోసం భారత్ సిద్ధంగా ఉంది. ఇంగ్లండ్ టూర్ లో 5 టెస్టులు ఆడనుంది. జూన్ 20 నుండి లీడ్స్‌లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) నేపథ్యంలో టీమిండియాకు ఈ సిరీస్ ఒక ప్రత్యేకమైనది. అంతేకాదు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడనున్న మొదటి సిరీస్ ఇదే. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా కొత్త ఫేజ్ ను ప్రారంభించనుంది.

రోహిత్, విరాట్ తమ రిటైర్ మెంట్లను ప్రకటించే ముందు.. బీసీసీఐ భారత సహాయక సిబ్బందిని తొలగించింది. వీరిలో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఉన్నారు. అయితే, తగిన ప్రత్యామ్నాయాన్ని వెతకడంలో విఫలం కావడంతో రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు టి.దిలీప్‌ను జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా తిరిగి నియమించాలని బిసిసిఐ నిర్ణయించింది.

ఓ నివేదిక ప్రకారం.. కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా విదేశీయుడి తీసుకోవాలని బిసిసిఐ చాలా ఆసక్తిగా ఉందట. కానీ పాలకమండలి అవసరమైన సమయంలో దానిని చేయలేకపోయిందట. అయితే టి దిలీప్‌ను తిరిగి నియమించడం వెనుక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రమేయం ఉందని సమాచారం. నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కోచ్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించాలని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు రోహిత్ శర్మ ప్రత్యేక అభ్యర్థన చేశాడట.

Also Read: పంజాబ్ వ‌ర్సెస్ ఆర్‌సీబీ.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు.. ఓడిపోయిన టీమ్ ప‌రిస్థితి ఏంటంటే?

దిలీప్ నిష్క్రమణ తర్వాత.. ర్యాన్ టెన్ డోస్చేట్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించాలని బీసీసీఐ చూస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, గంభీర్‌కు అసిస్టెంట్ కోచ్‌గా దిలీప్ కొనసాగుతాడు. ఫీల్డింగ్ కోచ్ గా తనదైన ముద్ర వేశాడు దిలీప్. కొత్త కొత్త చర్యలను ప్రవేశపెట్టాడు. మ్యాచ్ రోజున ఉత్తమ ఫీల్డర్‌కు పతకాలు ఇవ్వడం, ఆ పతకాలను అందించడానికి దిగ్గజ వ్యక్తులను తీసుకురావడం వంటివి అతడు తెచ్చిన మార్పులే.

ఇంగ్లండ్‌తో జరిగే టెస్టుల విషయానికొస్తే, కొత్తగా నియమితులైన టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిజర్వ్ బ్యాటర్ బి సాయి సుదర్శన్ జూన్ 6న ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే ఇండియా ఎ 4 రోజుల మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. గిల్, సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్‌లో భాగం. జూన్ 3న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కు జీటీ అర్హత సాధిస్తే, మ్యాచ్‌కు ముందు గిల్, సుదర్శన్ ఇద్దరూ టీమిండియాలో చేరడం కష్టం. అంతేకాదు ఇంగ్లండ్‌లోని పరిస్థితులను, రెడ్-బాల్ ఫార్మాట్‌ ను వారు వేగంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.