IPL 2025 qualifier 1 : పంజాబ్ వ‌ర్సెస్ ఆర్‌సీబీ.. గెలిచిన జ‌ట్టుకు ఫైన‌ల్‌కు.. ఓడిపోయిన టీమ్ ప‌రిస్థితి ఏంటంటే?

క్వాలిఫ‌య‌ర్‌-1లో విజేత‌గా నిలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్ చేరుకుంటుంది.

IPL 2025 qualifier 1 : పంజాబ్ వ‌ర్సెస్ ఆర్‌సీబీ.. గెలిచిన జ‌ట్టుకు ఫైన‌ల్‌కు.. ఓడిపోయిన టీమ్ ప‌రిస్థితి ఏంటంటే?

Courtesy BCCI

Updated On : May 28, 2025 / 3:04 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో లీగ్ ద‌శ ముగిసింది. గురువారం (మే 29) నుంచి ప్లేఆఫ్స్‌కు తెర‌లేవ‌నుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్లు క్వాలిఫ‌య‌ర్‌-1లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక‌ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు ఎలిమినేట‌ర్‌లో పోటీప‌డ‌నున్నాయి.

తొలి రెండు స్థానాల్లో నిల‌డంతో పంజాబ్ కింగ్స్‌, ఆర్‌సీబీల‌కు ఫైన‌ల్ చేరుకునేందుకు రెండు అవ‌కాశాలు ఉంటాయి. క్వాలిఫ‌య‌ర్‌-1లో విజేత‌గా నిలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్ చేరుకుంటుంది. ఓడిన జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్‌-2లో ఎలిమినేట‌ర్ విజేత‌తో త‌ల‌ప‌డాల్సి ఉంటుంది.

LSG : ఏడో స్థానంతో ఐపీఎల్ సీజ‌న్ ముగింపు.. పంత్ ఫోటోని పోస్ట్ చేస్తూ ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా ట్వీట్..

చండీగఢ్ వేదిక‌గా..
క్వాలిఫ‌య‌ర్‌-1తో పాటు ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ల‌కు చండీగఢ్ ఆతిథ్యం ఇవ్వ‌నుండ‌గా, క్వాలిఫ‌య‌ర్‌-2తో పాటు ఫైన‌ల్ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

హోరాహోరీగా..
గురువారం ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్‌లు తొలి క్వాలిఫ‌య‌ర్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ రెండు జ‌ట్లు కూడా లీగ్ ద‌శ‌లో చెరో 14 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ఇరు జ‌ట్లు చెరో 9 విజ‌యాల‌ను న‌మోదు చేశాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఇరు జ‌ట్లు 19 పాయింట్ల‌తో స‌మానంగా ఉన్న‌ప్ప‌టికి నెట్‌ర‌న్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండ‌డంతో పంజాబ్ తొలి స్థానంలో, ఆర్‌సీబీ రెండో స్థానంలో నిలిచింది.

LSG vs RCB : ఆర్‌సీబీ పై ఓట‌మి.. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు బీసీసీఐ బిగ్ షాక్‌..

తొలి క్వాలిఫ‌య‌ర్‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరుకోవాల‌ని ఇరు పంజాబ్‌, అటు ఆర్‌సీబీ జ‌ట్లు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.

హెడ్‌-టు- హెడ్..
ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇరు జ‌ట్లు 35 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ఆర్‌సీబీ 17 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 18 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలుపొందింది. ఇక ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు రెండు సార్లు త‌ల‌ప‌డ‌గా.. చెరో మ్యాచ్‌లో విజ‌యాన్ని అందుకున్నాయి.

LSG vs RCB : ఆర్‌సీబీ పై ఓట‌మి.. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇక క్రికెట్ గురించి ఆలోచించ‌ను..