ఓవల్ వేదికగా జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ ఐదవ టెస్ట్ మూడవ రోజు మ్యాచ్‌ను చూసేందుకు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ స్టేడియానికి వచ్చాడు. టెస్ట్ ఫార్మాట్‌కు రీసెంట్‌గా రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ఆట ప్రారంభమైన కొన్ని నిమిషాల తరువాత అతడు మైదానానికి వచ్చాడు.
ఆ సమయంలో రోహిత్ చేతికి రూ.2.46 కోట్లు విలువైన వాచ్ పెట్టుకున్నాడు. అది ఆపెనర్ ఔడమార్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ జంబో ఎక్స్‌ట్రా-తిన్ స్మోక్డ్ బర్గండీ టైటానియం వాచ్. ఆపెనర్ పిగ్వెట్ ఒక ప్రఖ్యాత స్విస్ లగ్జరీ గడియారాల బ్రాండ్.
రాయల్ ఓక్ జంబో ఎక్స్‌ట్రా వాచ్ అంటే ఆ బ్రాండ్‌లోని ఓ ప్రత్యేకమైన పలుచగా రూపొందించిన భారీ విలువ చేసే మోడల్. ఇది ముదురు ఎరుపు ఊదా కలర్‌తో టైటానియం మెటల్‌లో తయారు చేసిన డిజైన్. ఆ సమయంలో రోహిత్ బ్లాక్ డెనిమ్ షాకెట్, జీన్స్ ధరించి కనపడ్డాడు.
Also Read: ఇకపై డబ్ల్యూసీఎల్‌లో ఆడం.. పూర్తిస్థాయిలో బ్యాన్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన
మూడవ రోజు అద్భుత శతకం సాధించిన తర్వాత యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.. “రోహిత్ బాయ్‌ని చూశాను. హాయ్ అన్నాను. ఆయన ‘నీవు బ్యాటింగ్ కొనసాగించు’ అని చెప్పాడు” అని పేర్కొన్నాడు.
తన సెంచరీ గురించి జైస్వాల్ మాట్లాడుతూ.. “వికెట్ కొంచెం స్పైసీగా ఉంది. కానీ, నాకు బ్యాటింగ్ చాలా నచ్చింది. ఇంగ్లాండ్‌లో ఇలాంటి వికెట్లే ఉంటాయని నాకు తెలుసు. మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి షాట్లు ఆడాలనే విషయంపై కూడా స్పష్టత ఉంది” అని చెప్పాడు.
ROHIT SHARMA HAS ARRIVED AT THE OVAL TO SUPPORT TEAM INDIA. 🇮🇳pic.twitter.com/kmo3O9bRjl
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2025