Rohit Sharma and Babar Azam
Asia Cup 2022: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంటే రెండు దేశాలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లవర్స్ టీవీలకు హతుక్కుపోతారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఉత్కంఠగా చూస్తుంటారు. దీనికితోడు భారత్ – పాక్ జట్ల ఆటగాళ్లుసైతం ఒకరిపై ఒకరు దూషణల పర్వంతో గ్రౌండ్‌లో రెచ్చిపోతుంటారు. అయితే ఇవన్నీ గతంలో.. ప్రస్తుతం పాకిస్థాన్, ఇండియా క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ అంటే హైవోల్టేజీ ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు మాత్రం ఆప్యాయంగా పలుకురించుకోవటం చూస్తున్నాం. ఆసియా కప్ లో భాగంగా ఆదివారం రాత్రి జరిగే పాక్, ఇండియా టీ20 మ్యాచ్‌కోసం దుబాయ్‌లో రెండు రోజులుగా ఇరు జట్ల ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నారు.
ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు అలింగనాలు చేసుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురి క్రికెట్ల మధ్య సరదా సంభాషణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇండియా కెప్టెన్రో హిత్ శర్మ, పాక్ క్రికెటర్ బాబర్ అజంల మధ్య సరదా సంభాషణ సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
©️ meets ©️#AsiaCup2022 pic.twitter.com/OgnJZpM9B1
— Pakistan Cricket (@TheRealPCB) August 27, 2022
శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తరువాత రోహిత్, బాబర్ లు కొద్దిసేపు ముచ్చటించారు. రోహిత్ సరదాగా పాక్ క్రికెటర్ బాబర్ ను ఆటపట్టించాడు. బాబర్ పెళ్లి చేసుకో అంటూ రోహిత్ ప్రశ్నించడంతో సిగ్గుపడిన బాబర్ భయ్యా.. ఇప్పుడే వద్దు అంటూ సమాధానం ఇచ్చాడు. వీరి మధ్య సభాషణ సరదాగా సాగింది. ఈ వీడియోను పాక్ క్రికెట్ బోర్డు అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాక్, భారత్ క్రికెట్ ఆటగాళ్ల మధ్య సఖ్యతను చూసి సూపర్ అంటూ కితాబు ఇస్తున్నారు. ఏమైనా ఆగ్రహావేశాలు ఉంటే మ్యాచ్ వరకే పరిమితం చేసుకోవాలని, బయట ఇలా సరదాగా ఉండటం మంచిదేనంటూ నెటిజన్లు రీట్వీట్లు చేస్తున్నారు.