Rohit Sharma
Rohit Sharma and Hardik Pandya : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య సోమవారం రాత్రి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు కేవలం 15.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వరుసగా మూడో మ్యాచ్ లోనూ ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది. తాజా ఓటమితో ముంబై జట్టు వరుసగా మూడో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా ముంబై సొంతమైదానం వాంఖడే స్టేడియం ఆదినుంచి రోహిత్ నామస్మరణతో మారుమోగింది.
Also Read : IPL 2024 : వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని..! వీడియో వైరల్
ముంబై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు అప్పగించిన నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా రోహిత్ ఫ్యాన్స్, ముంబై జట్టు అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై జట్టు యాజమాన్యంతోపాటు హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన తరువాత ముంబై ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ స్టేడియంలో ప్రేక్షకులు రోహిత్ నామస్మరణ చేస్తూ హార్దిక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముంబై తమ తొలి మ్యాచ్ గుజరాత్ తో, రెండో మ్యాచ్ సన్ రైజర్స్ జట్టుతో ఆడింది. ఈ రెండు మ్యాచ్ లలోనూ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను రోహిత్ అభిమానులు హేళన చేశారు. తాజాగా వాంఖడే స్టేడియంలోనూ హార్దిక్ పాండ్యాను రోహిత్ ఫ్యాన్స్ వదిలిపెట్టలేదు. టాస్ వేసే క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు రోహత్, రోహిత్ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ‘ముంబై కా రాజా రోహిత్ శర్మ’ అంటూ రోహిత్ అభిమానులు స్టేడియంలో రచ్చచేశారు.
Also Read : IPL 2024 : మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయిన ముంబై జట్టు.. హార్ధిక్ కెప్టెన్సీ ఊడినట్లేనా!
ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్దకు ఫీల్డింగ్ చేస్తున్నాడు. దీంతో ప్రేక్షకులు రోహిత్.. రోహిత్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాక హార్దిక్ పాండ్యాను హేళన చేయడం ప్రారంభించారు. దీంతో రోహిత్ శర్మ అలా చేయొద్దు అంటూ ప్రేక్షకులకు సజ్ఞలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్ సూచనలతో కొద్దిసేపు ప్రేక్షకులు సైలెంట్ అయ్యారు. ఇదిలాఉంటే.. ముంబై జట్టు వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోవటంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోకి వెళ్లిపోయింది. దీంతో వచ్చే మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించి.. రోహిత్ కు మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.
they can ban only posters but not our voice, sound ? #RohitSharma #RohitSharma? #mumbaiindians #mivsrr pic.twitter.com/HHqqyxp65L
— only Rohit matter! (@Onlyrohitmatter) April 1, 2024
Respect ♥️ #RohitSharma #RohitSharma? #MIvRR @Satya_Prakash08 pic.twitter.com/U2lTzaUP1o
— only Rohit matter! (@Onlyrohitmatter) April 1, 2024