మైదానంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు వార్నింగ్ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్

నాల్గో టెస్టు మూడోరోజు (ఆదివారం) ఆటలో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ సర్ఫరాజ్ ఖాన్ పై సీరియస్ అయ్యారు.

Rohit Sharma

India vs England 4th Test : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ రాంచీలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. మూడోరోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. సోమవారం నాల్గోరోజు ఆటలో మరో 152 పరుగులు సాధిస్తే టీమిండియా విజేతగా నిలుస్తుంది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. నాల్గో టెస్టులోనూ విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇదిలాఉంటే మూడోరోజు ఆట సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పై సీరియస్ అయ్యారు.

Also Read : IND vs ENG 4th Test : తిప్పేసిన స్పిన్న‌ర్లు.. ఇంగ్లాండ్ 145 ఆలౌట్‌.. రాంచీలో విజ‌యానికి చేరువ‌లో భార‌త్‌

నాల్గో టెస్టు మూడోరోజు (ఆదివారం) ఆటలో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ సర్ఫరాజ్ ఖాన్ పై సీరియస్ అయ్యారు. 47వ ఓవర్ వేసేందుకు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సిద్ధమయ్యాడు. ఫీల్డింగ్ మార్పుల్లో భాగంగా సర్ఫరాజ్ ఖాన్ సిల్లీ పాయింట్ లో ఉండమని సూచించాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ హెల్మెంట్ ధరించకుండా ఫీల్డింగ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ గమనించి సర్ఫరాజ్ ఖాన్ పై సీరియస్ అయ్యారు. హెల్మెంట్ ధరించమని సూచించారు. హెల్మెంట్ ధరించకుండా ఫీల్డింగ్ ఎలా చేస్తావ్ అంటూ సీరియస్ అయ్యారు. ఏ భాయ్, జ్యాదా హీరో మత్ బ్యాన్ (హే, ఇక్కడ హీరోగా ఉండటానికి ప్రయత్నించవద్దు) అంటూ సర్ఫరాజ్ ఖాన్ ను ఉద్దేశిస్తూ రోహిత్ శర్మ సీరియస్ అయ్యారు. వెంటనే కేఎస్ భరత్ తెచ్చిన హెల్మెంట్ ను ధరించి సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ చేశాడు.

Also Read : Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. టెస్టుల్లో 4వేల ప‌రుగులు పూర్తి