IND vs ENG 4th Test : తిప్పేసిన స్పిన్న‌ర్లు.. ఇంగ్లాండ్ 145 ఆలౌట్‌.. రాంచీలో విజ‌యానికి చేరువ‌లో భార‌త్‌

రాంచీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టుబిగించింది

IND vs ENG 4th Test : తిప్పేసిన స్పిన్న‌ర్లు.. ఇంగ్లాండ్ 145 ఆలౌట్‌.. రాంచీలో విజ‌యానికి చేరువ‌లో భార‌త్‌

IND vs ENG 4th Test

రాంచీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టుబిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 145 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. దీంతో టీమ్ఇండియా ముందు 192 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యం నిలిచింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 40 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (16), రోహిత్ శ‌ర్మ (24) లు క్రీజులో ఉన్నారు. భార‌త విజ‌యానికి ఇంకా 152 ప‌రుగులు అవ‌స‌రం కాగా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెల‌వాలంటే ఏదైన అద్భుతం జ‌ర‌గాల్సిందే.

తిప్పేసిన స్పిన్న‌ర్లు

తొలి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌కు భార‌త స్పిన్న‌ర్లు వ‌రుస షాకులు ఇచ్చారు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఐదు వికెట్ల‌తో చెల‌రేగ‌గా, కుల్దీప్ యాద‌వ్ నాలుగు వికెట్లు, ర‌వీంద్ర జ‌డేజా ఓ వికెట్ తీయ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 145 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ జాక్ క్రాలీ (60; 91 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ‌శ‌తకం చేశాడు. జానీ బెయిర్ స్టో (30) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు.

WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్‌లో విషాదం.. మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే.. ప్రముఖ స్పోర్ట్స్ కెమెరామెన్ తిరువల్లువన్ కన్నుమూత

ధ్రువ్ జురెల్ ఒంటి పోరాటం..

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 219/7 తో మూడో రోజు ఆట‌ను ప్రారంభించిన టీమ్ఇండియా మ‌రో 88 ప‌రుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు న‌ష్ట‌పోయింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 30 ప‌రుగుల‌తో ఆట‌ను ఆరంభించిన ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. కుల్దీప్ యాద‌వ్ (28) కొద్ది సేప‌టికే పెవిలియ‌న్‌కు చేరుకున్నా ఆకాశ్ దీప్ (9) జ‌త‌గా చెల‌రేగిపోయాడు.

కుల్దీప్‌తో క‌లిసి 76 ప‌రుగులు, ఆకాశ్‌దీప్‌తో 40 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి టీమ్ఇండియా స్కోరును 300 దాటించాడు. చివ‌రి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 307 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌కు 46 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో యువ స్పిన్న‌ర్ షోయ‌బ్ బ‌షీర్ ఐదు వికెట్టు తీశాడు. టామ్‌హార్డ్లీ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జేమ్స్ అండ‌ర్స‌న్ రెండు వికెట్లు సాధించాడు.

Deepak Chahar : కొత్త త‌ర‌హా మోసం బారిన ప‌డ్డ టీమిండియా పేస‌ర్‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ జొమాటో