Riyan Parag : నీకు ఇదేం పాడు బుద్ధి నాయ‌నా..! హీరోయిన్ల అందాల కోసం తెగ వెతికిన పరాగ్‌ ?

ఐపీఎల్ సీజ‌న్ ముగిసి ఒక్క రోజు కాలేదు కానీ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు రియాన్ ప‌రాగ్‌.

RR Star Riyan Parag Alleged YouTube Search History Goes Viral

Riyan Parag YouTube History : ఐపీఎల్ 17 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ అద‌ర‌గొట్టాడు. త‌న బ్యాటింగ్ విన్యాసాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఈ సీజ‌న్‌లో నిల‌క‌డ‌గా రాణించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందాడు. అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 52 స‌గ‌టుతో 149 స్ట్రైక్‌రేటుతో 573 ప‌రుగులు చేశాడు.

ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లి (741), రుతురాజ్ గైక్వాడ్ (583) ల త‌రువాతి స్థానంలో ఉన్నాడు. అయితే.. ఈ ఐపీఎల్ సీజ‌న్ ముగిసి ఒక్క రోజు కాలేదు కానీ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. అత‌డి యూట్యూబ్ సెర్చ్ హిస్ట‌రీ అభ్యంత‌ర‌క‌ర‌మైన కంటెంట్‌తో నిండి ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం.

రియాన్ పరాగ్ లైవ్ స్ట్రీమింగ్ చేసే గేమింగ్ ఛానెల్‌ని కూడా నడుపుతున్నాడు. ఈ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో.. పరాగ్ యూట్యూబ్‌లో కాపీరైట్ లేని సంగీతం కోసం వెతుకుతున్నాడు. సెర్చ్ బాక్స్ పై అత‌డు క్లిక్ చేయగానే అతని సెర్చ్ హిస్టరీలో బాలీవుడ్ హీరోయిన్లు అనన్య పాండే, సారా అలీఖాన్ పేర్లు క‌నిపించాయి. వారి పేర్ల పక్కనే హాట్ అని రాసి ఉంటుంది.

Kavya Maran : ఎస్ఆర్‌హెచ్‌ ఓటమి తరువాత కావ్య మారన్ ప‌వ‌ర్‌ఫుల్‌ స్పీచ్? నెటిజన్ల ప్రశంసల జల్లు

అత‌డు త‌న సెర్చ్ హిస్ట‌రీని హైడ్ చేయ‌కపోవ‌డంతో అత‌డి ప‌ర్స‌న‌ల్ హిస్ట‌రీ కాస్త‌ ప‌బ్లిక్‌కు లీక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. హీరోయిన్ల అందాల కోసం వెతికిన ప‌రాగ్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. నీకు ఇదేం పాడు బుద్ది అంటూ ప‌లువురు నెటిజ‌న్లు అత‌డిపై మండిప‌డుతున్నారు.

కాగా.. రియాన్ ప‌రాగ్ వివాదాల్లో చిక్కుకోవ‌డం ఇదే మొద‌టి సారి కాదు. ఇంత‌క‌ముందు కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు, మైదానంలో వింత చ‌ర్య‌ల కార‌ణంగా వివాదాల్లో చిక్కుకున్నాడు.

Head coach: టీమిండియా తదుపరి కోచ్ ఎవరు? రేసులో ఎవరెవరున్నారు?

ట్రెండింగ్ వార్తలు