Ruturaj Gaikwad fiancee utkarsha pawar
Ruturaj Gaikwad-Utkarsha Pawar: ఐపీఎల్-16 సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) నిలిచిన సంగతి తెలిసిందే. సీఎస్‌కే టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఒకడు. తాజాగా ఈ స్టార్ ఓపెనర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final 2023) నుంచి తప్పుకున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నాడు. అయితే తన పెళ్లి దృష్ట్యా తాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉండడని అతడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)కు తెలియజేశాడు. అతడు తప్పుకోవడంతో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal)ను అదృష్టం వరించింది.
IPL2023 Final: ఐపీఎల్-16 టైటిల్ విజేతగా చెన్నై.. ఉత్కంఠ పోరులో గుజరాత్ పై విజయం
26 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ జూన్ 3వ తేదీన ఉత్కర్ష పవార్(Utkarsha Pawar) ని వివాహం చేసుకోనున్నాడు. తన ప్రియురాలు అయిన ఉత్కర్ష తో కలిసి రుతురాజ్ ఐపీఎల్ ట్రోఫీతో దిగిన ఫోటోలు అతడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమె పై పడింది. రుతురాజ్ చేసుకునే ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది అన్న విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు నెటీజన్లు.
పూణేకి చెందిన ఉత్కర్ష పవార్ అక్టోబరు 13, 1998 న జన్మించింది. ఆమె కూడా ఓ క్రికెటర్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. దేశవాలీలో మహారాష్ట్ర జట్టుకు ఆడింది. రుతురాజ్ లాగా ఈమె కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్. అంతేకాకుండా రైట్ హ్యాండ్ మీడియం పాస్ట్ బౌలింగ్ చేస్తూ మంచి ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది. కాగా.. ఈమె గత 18 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటోంది. క్రికెట్ మాత్రమే కాదు చదువులో రాణిస్తోంది. పుణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైనెన్స్‌లో చదువుకుంటోంది.