SA vs AUS
SA vs AUS: ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. బౌండరీల మోత మోగించాడు. దీంతో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. (SA vs AUS)
కెయిర్న్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌లను 2-1తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఓడిపోయే మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయం సాధించింది. (SA vs AUS)
Also Read: No Look Sixes: ఎవరు బ్రో నువ్వు.. ఈ రేంజ్ లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టావ్.. కనీసం చూడకుండా..
ఈ మ్యాచ్‌లో తొలుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్ బ్రేవిస్ 26 బంతుల్లో ఆరు సిక్సులు, ఒక ఫోర్ సహాయంతో 53 పరుగులు చేశాడు. అతడితో పాటు వండర్ డస్సెన్ (38), స్టబ్స్ (25) రాణించాడు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఓటమి అంచుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో మాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్ ను గెలిపించాడు.
173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ తొలి వికెట్ కు 66 పరుగులు అందించారు. అయితే, సఫారీ బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వడంతో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లోకి వెళ్లింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు.
మాక్స్‌వెల్ 36 బంతుల్లో 8ఫోర్లు, రెండు సిక్సుల సహాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితోపాటు కెప్టెన్ మిచెల్ మార్ష్ (54) రాణించడంతో ఆసీస్ విజయకేతనం ఎగురవేసింది.
RELIVE THE ICONIC INNINGS OF MAXWELL IN T20I SERIES DECIDER AGAINST SOUTH AFRICA…!!! 🔥 pic.twitter.com/Mai9qsDhQH
— Johns. (@CricCrazyJohns) August 16, 2025
చివరిలో ఉత్కంఠ..
చివరిలో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. రెండు ఓవర్లు ఉన్నాయి. ఆసీస్ విజయానికి 12 పరుగుల అవసరం. కోర్బిన్ బోచ్ సంచలన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మార్చాడు. 19వ ఓవర్లో బెన్ ద్వార్షాయిస్ (1), నాథన్ ఎల్లిస్ (0)లను వెంటవెంటనే ఔట్ చేశాడు. దీంతో ఆ ఓవరల్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక, చివరి ఓవరల్లో ఆసీస్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా.. లుంగి ఎంగిడి బౌలింగ్ చేశాడు. మ్యాక్స్‌వెల్ తొలి రెండు బంతుల్లోనే ఆరు పరుగులు రాబట్టాడు. ఆ తరువాతి రెండు బంతులు డాట్ కావటంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. రెండు బంతులకు నాలుగు పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి మ్యాక్స్‌వెల్ ఫోర్ కొట్టి ఆసీస్‌కు విజయాన్ని అందించాడు. దీంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది.
Also Read: అరుదైన దృశ్యం: ఒకే వేదికపై ధోనీ, గంభీర్, రోహిత్.. ఎందుకంటే? ఫొటోలు వైరల్