SA vs IND 1st T20 : ద‌క్షిణాఫ్రికాతో తొలి టీ20 వర్షార్పణం.. టాస్‌ పడకుండానే మ్యాచ్‌ రద్దు

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన మొద‌టి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది.

SA vs IND 1st T20

అనుకున్న‌దే జ‌రిగింది. భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన మొద‌టి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. మ్యాచ్ ఆరంభానికి ముందు నుంచే వ‌ర్షం కురుస్తోంది. ఎంత సేప‌టికి వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచును ర‌ద్దు చేశారు. క‌నీసం టాస్ కూడా ప‌డ‌కుండానే మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో అభిమానులు నిరాశ చెందారు. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా మొద‌టి మ్యాచ్ ర‌ద్దు కాగా.. ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ డిసెంబ‌ర్ 12న సెయింట్ జార్జ్ పార్క్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

టాస్ ఆల‌స్యం..

South Africa vs India 1st T20 : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా డ‌ర్బ‌న్ వేదిక‌గా భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాల‌ని ఇరు జ‌ట్లు ఆరాట‌ప‌డుతున్నాయి. అయితే.. వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్యం అవుతోంది.