Sachin Tendulkar : భార్య అంజ‌లి, కూతురు సారాతో క‌లిసి ఓటేసిన స‌చిన్ టెండూల్క‌ర్‌.. వీడియో

దిగ్గ‌జ ఆట‌గాడు, క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ సైతం త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

Sachin Tendulkar and his wife and their daughter cast their votes

మ‌హారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొన‌సాగుతోంది. బుధ‌వారం ఉద‌యం 7 గంట‌లకు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జ‌రుగుతోంది. ఇక ఝార్ఖండ్‌ లో రెండోవిడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఈ క్ర‌మంలో పౌరులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల‌కు క్యూ క‌ట్టారు. ఇక దిగ్గ‌జ ఆట‌గాడు, క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ సైతం త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

Virat Kohli : పాక్‌లో ఆడేందుకు విరాట్ కోహ్లీ ప్ర‌య‌త్నిస్తున్నాడు.. పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రానికి త‌న భార్య అంజ‌లి, కూతురు సారాతో క‌లిసి వ‌చ్చాడు. వీరు ముగ్గురు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన అనంత‌రం స‌చిన్ టెండూల్క‌ర్ మీడియాతో మాట్లాడారు. ఓటు వేయ‌డం ప్ర‌తి పౌరుడి బాధ్య‌త అని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రు ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని ఆయ‌న కోరారు.

SA vs IND : భార‌త్ పై టీ20 సిరీస్ ఓట‌మి.. ద‌క్షిణాఫ్రికా పేస‌ర్‌కు షాకిచ్చిన ఐసీసీ