SA vs IND : భార‌త్ పై టీ20 సిరీస్ ఓట‌మి.. ద‌క్షిణాఫ్రికా పేస‌ర్‌కు షాకిచ్చిన ఐసీసీ

అస‌లే టీమ్ఇండియా పై టీ20 సిరీస్ కోల్పోయి ఓట‌మి బాధ‌లో ఉన్న ద‌క్షిణాఫ్రికాకు ఐసీసీ షాకిచ్చింది.

SA vs IND : భార‌త్ పై టీ20 సిరీస్ ఓట‌మి.. ద‌క్షిణాఫ్రికా పేస‌ర్‌కు షాకిచ్చిన ఐసీసీ

Gerald Coetzee reprimanded for breaching ICC Code of Conduct in 4th T20

Updated On : November 19, 2024 / 9:42 PM IST

అస‌లే టీమ్ఇండియా పై టీ20 సిరీస్ కోల్పోయి ఓట‌మి బాధ‌లో ఉన్న ద‌క్షిణాఫ్రికాకు ఐసీసీ షాకిచ్చింది. ఆ జ‌ట్టు యువ పేస‌ర్ గెరాల్డ్ కొయెట్జీ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. అత‌డి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. అంతేకాదండోయ్ ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయింది.

జోహన్నెస్‌బర్గ్‌లో భారత్‌తో జరిగిన నాలుగో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు గెరాల్డ్ కోయెట్జీని ఐసీసీ మంగళవారం మందలించింది. ఆ మ్యాచ్‌లో కొయెట్జీ భార‌త ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్‌లో అంపైర్ వైడ్ ఇచ్చిన త‌రువాత అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Blind T20 World Cup : పాక్‌కు షాక్‌.. అంధుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి వైదొలిగిన భార‌త్‌..!

దీనిపై మైదానంలోని అంపైర్లు అల్లావుడియన్ పాలేకర్, స్టీఫెన్ హారిస్, థర్డ్ అంపైర్ లుబాబాలో గ్కుమా, ఫోర్త్ అంపైర్ ఆర్నో జాకబ్స్ ఈ విష‌యాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఐసీసీ సీరియ‌స్ అయింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ విచార‌ణ చేశాడు.

పేస‌ర్ గెరాల్డ్ కొయెట్జీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించాడు. ఇక ఐసీసీ ఓ డీమెరిట్ పాయింట్ అత‌డి ఖాతాలో చేర్చింది. అత‌డు నేరాన్ని అంగీక‌రించాడ‌ని దీంతో త‌దుప‌రి ఎలాంటి విచార‌ణ ఉండ‌ద‌ని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

SA vs SL : ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. కెప్టెన్ వ‌చ్చేస్తున్నాడు..

ఓ ఆట‌గాడి ఖాతాలో 24 నెల‌ల వ్య‌వ‌ధిలో నాలుగు లేదా అంత‌కంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే అవి సస్పెన్ష‌న్ పాయింట్లుగా మారుతాయి. ఆట‌గాడిపై నిషేదం విధిస్తారు. రెండు సస్పెన్షన్ పాయింట్లు ఒక టెస్ట్ లేదా రెండు ODIలు లేదా రెండు T20Iల నుండి నిషేధానికి సమానం.