SA vs SL : ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. కెప్టెన్ వ‌చ్చేస్తున్నాడు..

ద‌క్షిణాఫ్రికా క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.

SA vs SL : ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. కెప్టెన్ వ‌చ్చేస్తున్నాడు..

Temba Bavuma back to lead Proteas in Sri Lanka Test series

Updated On : November 19, 2024 / 4:49 PM IST

ద‌క్షిణాఫ్రికా క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. గాయం నుంచి కోలుకున్న రెగ్యుల‌ర్ కెప్టెన్ టెంబా బ‌వుమా వ‌చ్చేశాడు. స్వదేశంలో శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌తో అత‌డు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ఈ సిరీస్‌కు అత‌డే కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు 14 మందితో కూడిన‌ జ‌ట్టును ప్ర‌క‌టించింది ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.

అక్టోబర్ 4న‌ ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో బ‌వుమా చేతికి గాయ‌మైంది. దీంతో గ‌త కొన్నాళ్లుగా అత‌డు ఆట‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవ‌ల కోలుకోగా తాజాగా నిర్వ‌హించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో గ‌ట్టెక్కాడు. దీంతో మ‌ళ్లీ అత‌డికే ప‌గ్గాలు అప్ప‌గించారు. శ్రీలంక‌తో సిరీస్‌కు లుంగి ఎంగిడి దూరం అయ్యాడు. అత‌డితో పాటు నండ్రే బ‌ర్గ‌ర్ సైతం గాయాల‌తో దూరం అయ్యారు. టీమ్ఇండియాతో టీ20 సిరీస్‌లో సత్తా చాటిన మార్కో జన్సెన్‌, గెరాల్ట్‌ కొయెట్జీ చాలాకాలం తర్వాత టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.

AUS vs IND : తొలి టెస్టు పిచ్‌ను చూశారా? బ్యాట‌ర్ల వెన్నులో వ‌ణుకే.. టీమ్ఇండియాకు క‌ష్ట‌కాల‌మే?

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ చేరుకునేందుకు ద‌క్షిణాఫ్రికాకు మంచి అవ‌కాశాలే ఉన్నాయి. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టుల‌తో పాటు ఆ త‌రువాత స్వ‌దేశంలో పాకిస్థాన్ జ‌ర‌గ‌నున్న రెండు టెస్టు మ్యాచుల్లోనూ గెలిస్తే ఫైన‌ల్‌కు వెళ్లేందుకు ద‌క్షిణాఫ్రికాకు మెరుగైన అవ‌కాశాలు ఉంటాయి.

శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఇదే..
టెంబా బవుమా (కెప్టెన్‌), డేవిడ్‌ బెడింగ్హమ్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌, ఎయిడెన్ మార్‌క్ర‌మ్‌, వియాన్‌ ముల్దర్‌, సెనూరన్‌ ముత్తుస్వామి, డేన్‌ పీటర్సన్‌, కగిసో రబాడ, ట్రిస్టన్‌ స్టబ్స్‌, ర్యాన్‌ రికెల్టన్‌, కైల్‌ వెర్రిన్‌

ICC Champions Trophy 2025 : పాకిస్థాన్‌ను హైబ్రిడ్ మోడ్‌కు ఒప్పించేందుకు ఐసీసీ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు..!

ద‌క్షిణాఫ్రికా, శ్రీలంక టెస్టు సిరీస్‌ షెడ్యూల్..
తొలి టెస్ట్ – నవంబర్‌ 27 నుంచి డిసెంబర్ 1 వ‌ర‌కు – డర్బన్ వేదిక‌గా
రెండో టెస్ట్ – డిసెంబర్‌ 5 నుంచి డిసెంబర్ 9 – గెబెర్హా వేదిక‌గా